Sunday, May 19, 2024
- Advertisement -

బంగ్లాపై భార‌త్ ఇన్నీగ్స్‌ను త‌ల‌పించిన ఇంగ్లండ్ ఆట‌…

- Advertisement -

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు మరోసారి అదరగొట్టగా…మిడిలార్డ‌ర్ విఫ‌లం అయ్యింది. బంగ్లాపై భార‌త్ ఎలా ఆడిందో అదే విధంగా ఇంగ్లండ్ కూడా న్యూజిలాండ్‌పై అదే ఆట‌ను త‌ల‌పించింది. ఫలితంగా న్యూజిలాండ్‌తో క్వార్టర్‌ఫైనల్ లాంటి మ్యాచ్‌లో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించి సూపర్ ఛాన్స్‌ను చేజార్చుకుంది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో(106: 99 బంతుల్లో 15ఫోర్లు, సిక్స్), జేసన్ రాయ్(60: 61 బంతుల్లో 8ఫోర్లు) హిట్టింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 305 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. ఇంగ్లాండ్ వరల్డ్ కప్ సెమీస్ చేరేందుకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. లేదంటే పాకిస్థాన్ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది.

ఓపెనర్లు జాసన్ రాయ్ (60), జానీ బెయిర్ స్టో (106) తొలి వికెట్‌కు 18.4 ఓవర్లలోనే 123 పరుగులు జోడించారు. టాప్ ఆర్డర్ దూకుడుతో.. 31 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మొదట్లో కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఇంగ్లాండ్ ఆ తర్వాత తడబడింది. మ్యాచ్ మధ్యలో గట్టిగా పుంజుకున్న కివీస్ బౌలింగ్ దళం వరుస ఓవర్లలో వరుసగా వికెట్లు పడగొట్టి స్కోరు వేగానికి భారీగా అడ్డుకట్ట వేసింది. బౌల్ట్, హెన్రీ కళ్లుచెదిరే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించారు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్.. ఆసాంతం బంగ్లాదేశ్‌పై టీమిండియా బ్యాటింగ్‌ను గుర్తుకు తెచ్చింది. ఇరు జట్లు ఓ దశలో 350 పరుగులు చేసేలా కనిపించినా.. 300+కే పరిమితమయ్యాయి. బంగ్లాదేశ్‌పై భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ చేయగా.. మరో ఓపెనర్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్‌లో ఓపెనర్ బెయిర్ స్టో 106 రన్స్ చేయగా.. మరో ఓపెనర్ జాసన్ రాయ్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇరు జ‌ట్ల‌లోనూ ఎవ‌రూ కూడా వీరు మిన‌హా ఎవ‌రూ కూటా త‌మ ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించ‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -