Friday, May 17, 2024
- Advertisement -

2021 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2023 వన్డే ప్రపంచకప్‌ భార‌త్ లోనే…

- Advertisement -

2021 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2023 వన్డే ప్రపంచకప్‌లను భార‌త్ లో నిర్వ‌హించ‌కుండా వేరే చోటుకి త‌ర‌లిస్తామ‌ని గ‌తంలో ఐసీసీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మాట మార్చింది.2 021 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2023 వన్డే ప్రపంచకప్‌ల‌ను భార‌త్‌లోనే నిర్వ‌హిస్తామ‌ని ఐసీసీ ఛీఫ్‌ డేవ్‌ రిచర్డ్సన్‌ స్పష్టం చేశారు.

దీనికి ప్ర‌ధాన‌కార‌ణం 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌కు భారత ప్రభుత్వం పన్నుల రూపంలో రూ.161.32 కోట్లను వసూలు చేసింది. ప్రసారకర్తగా ఉన్న సోనీ స్పోర్ట్స్ ఈ పన్నులను చెల్లించాకే, మిగిలిన మొత్తాన్ని ఐసీసీకి అందించింది. దీంతో తమకు జరిగిన నష్టాన్ని బీసీసీఐ భర్తీ చేయాలని ఐసీసీ డిమాండ్‌ చేసింది. ఈ న‌ష్టాన్ని చెల్లించ‌క‌పోతే భారత్‌లో జరిగే మెగాటోర్నీలను ఇత‌ర దేశాల‌కు త‌ర‌లిస్తామ‌ని వెల్ల‌డించింన సంగ‌తి తెలిసిందే.

పన్ను మినహాయింపులు ప్రపంచ క్రికెట్‌కు చాలా ముఖ్యం. ఎందుకంటే ఐసీసీకి వచ్చే ప్రతి రూపాయిని మళ్లీ ఆట కోసమే ఖర్చుపెడ్తాం. ఉదాహరణకు వెస్టిండీస్‌ వంటి జట్లు రెవెన్యూ పొందలేవు. అలాంటి జట్లకు ఐసీసీ అండగా ఉంటుంద‌న్నారు. ఈ సారి జ‌రిగే మెగా టోర్నీల‌కు భార‌త ప్ర‌భుత్వం ప‌న్ను మిన‌హాయింపులు ఇస్తుంద‌ని ఆశిస్తున్నామ‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -