Thursday, May 16, 2024
- Advertisement -

కోహ్లీ వ‌ర్సెస్ మిచెల్ స్టార్క్

- Advertisement -

త్వ‌ర‌లో టీమిండియా సుదీర్ఘ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌నకు బ‌య‌ల్దేరింది. ఆతిథ్య జట్టుతో కోహ్లీసేన నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఇప్పటి వరకు అక్కడ సిరీస్‌ గెలవని భారత్‌ ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని తహతహలాడుతోంది. అందులోనూ ఆసీస్‌ కీలక ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ లేకపోవడం కలిసొచ్చే అంశం. అయితే అప్పుడే ఆదేశ మాజీ ఆట‌గాల్లు నోటికి ప‌నిచెప్తున్నారు.

భారత్ జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య లేని లోటు తీర్చలేనిదంటూ అవాజ్యప్రేమని కురిపించగా.. కోహ్లీ‌కి సవాల్ విసిరేందుకు ముగ్గురు ఆసీస్ బౌలర్లు సిద్ధంగా ఉన్నారంటూ తాజాగా ఆడమ్ గిల్‌క్రిస్ట్ కవ్వించే ప్రయత్నం చేశాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్, వార్నర్ లేకుండా టెస్ట్ సిరీస్ గెలిచేందుకు భారత్‌కు మంచి అవకాశముంది. కానీ స్టార్క్, హాజిల్‌వుడ్, ప్యాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్‌తో కూడిన ఆసీస్ బౌలింగ్ బృందాన్ని తొలిసారి ఎదుర్కొవడం టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాద‌న్నారు.

ఏ విదేశీ జట్టు ఆసీస్‌లో పర్యటించినా.. ఆ టీమ్‌ మానసిక స్థైర్యం దెబ్బతినేటట్లు మాట్లాడటం ఆ దేశ మాజీ క్రికెటర్లకే చెల్లింది. టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో విరాట్ కోహ్లి, ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మధ్య ఆధిపత్య పోరు జరిగింది.. ఇప్పుడు కోహ్లీ, పేసర్ మిచెల్ స్టార్క్‌ మధ్య ఆ పోరు జరగనుందా..? అని గిల్‌క్రిస్ట్‌ని ప్రశ్నించగా..స్టార్క్‌తో పాటుఅతనికి మరో ఇద్దరు బౌలర్లు కూడా సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు. పాట్ కమిన్స్ ఈ మధ్యకాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇక హేజిల్‌వుడ్ అయితే.. వేగం, కచ్చితత్వంతో మెక్‌గ్రాత్‌ని తలపిస్తున్నాడంటూ కితాబిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -