Friday, May 17, 2024
- Advertisement -

ఇండియా ఓడింది… వ‌న్డేల్లో వ‌ర‌ల్డ్‌ రికార్డును సాధించిన ధోని

- Advertisement -

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో జట్టు ఘోర పరాభవాన్ని చవిచూడగా.. టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్‌ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు 112 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ల‌క్ష్య‌ ఛేదనకు దిగిన పర్యాటక జట్టు 20.4 ఓవర్లకే విజయం సాధించింది. అయితే ధోనీ మ‌రో సారి త‌న ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించారు. ధోనీ (65) అర్ధశతకం సాధించాడు. దీంతో ఆస్కోరైనా చేసింది ఇండియా.

ఇండియా ఓడినా జార్ఖండ్ డైన‌మేట్ ధోనీ వ‌రల్డ్ రికార్డు సాధించారు. శ్రీలంక‌తో ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఘ‌న‌త సాధించారు. ఈ మ్యాచ్‌లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 65 పరుగులు చేసిన ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో 16 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో కీపర్‌గా రికార్డులకెక్కాడు.

శ్రీలంక మాజీ కెప్టెన్, కీపర్ కుమార సంగక్కర తొలుత ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ధోనీ 16 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఆటగాళ్లలో ధోనీ ఆరో ఆటగాడు. సచిన్, రాహుల్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాన్ని ధోనీ ఆక్రమించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -