Saturday, May 18, 2024
- Advertisement -

ఆసిస్‌లో షా క్రేజ్ చూస్తే దిమ్మ‌తిరిగి పోద్దీ

- Advertisement -

అసిస్‌లో షా ఉన్న క్రేజ్‌ను చూసి ఖ‌షీ అవుతున్నారు క్రికెట్ అభిమానులు. ఆరంగేట్రంతోనే ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుని టీమిండియా భవిష్యత్తు ఆశా కిరణంగా పృథ్వీ షా . తొలి టెస్టుకి ముందే భారత యువ ఓపెనర్ పృథ్వీ షా‌‌ ‘స్టార్‌’‌గా మారిపోయాడు. సిడ్నీ వేదికగా క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ టీమ్‌తో ఈరోజు ఆరంభమైన నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్ధశతకం బాదిన పృథ్వీ షా ( 66: 69 బంతుల్లో 11×4) అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు.

దాంతో ఒక్క సారిగా క్రేజ్ పెరిగిపోయింది. షాతో సెల్ఫీల‌కోసం అభిమానులు ఎగ‌బ‌డ్డారు. భారత్ తరఫున ఇప్పటి వరకు పృథ్వీ షా ఆడింది కేవలం రెండు టెస్టులు మాత్రమే. ఇక తొలి మ్యాచ్‌లోనే అనుభవమున్న ఆటగాడిగా కచ్చితమైన షాట్‌లతో, అద్భుతమైన టైమింగ్‌తో షా ఆకట్టుకున్నాడు. దీంతో ఈ యంగ్‌ ప్లేయర్‌ను అభిమానులు, క్రీడా విశ్లేషకులు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వగ్‌, ఎంఎస్‌ ధోనిలతో పొల్చడం మొదలెట్టేశారు. తన ప్రతిభతో కీలక ఆసీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా తలపడబోయే టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.

వెస్టిండీస్‌తో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌తో భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా.. తొలి మ్యాచ్‌లోనే శతకం బాది అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రెండో టెస్టులోనూ అర్ధశతకం సాధించి.. మొత్తంగా ఆ సిరీస్‌‌లో 118.50 సగటుతో 237 పరుగులు చేశాడు. దీంతో.. పృథ్వీ షా‌ని ఏకంగా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోలుస్తూ మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు.

దేశవిదేశాల్లో టీమిండియా క్రికెటర్లకు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంకా పట్టుమని పది మ్యాచ్‌లు కూడా ఆడని షాకు ఆసీస్‌లోని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ సందర్భంగా మైదానం బయట పృథ్వీషాతో సెల్ఫీలు దిగడానికి ఫ్యాన్స్‌ పోటీపడ్డారు. అయితే అభిమానులను నిరుత్సాహపరచకుండా ఓపికగా సెల్ఫీలు దిగి వారందరినీ ఆనందపరిచాడు. సామాజిక మాధ్య మాల్లో ఈవీడియో వైరల్ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -