Friday, May 17, 2024
- Advertisement -

కోహ్లీనీ రెచ్చ‌గొడితే మీకే ప్ర‌మాదం. ద‌క్షిణాప్రియా కెప్టెన్ డూప్లెసెస్

- Advertisement -

ఇటీవల స్వదేశంలో ముగిసిన ద్వైపాక్షిక సిరీస్‌లో వెస్టిండీస్‌ జట్టును చిత్తుచేసిన భారత క్రికెట్‌ జట్టు.. ఇప్పుడు విదేశీ గడ్డపై మరో సవాల్‌కు సిద్ధమవుతోంది. త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ సాధించని ఘనతను అందుకోవాలని విరాట్ కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు.

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు టీమిండియా వెల్తున్న సంద‌ర్భంగా ఆ దేశ ఆట‌గాల్ల‌కు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌ ఓ సలహా ఇచ్చాడు. ఈనెల 21 నుంచి భారత్ జట్టు ఆ గడ్డపై మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ను ఆడ‌నుంది ఇండియా.

ఆట‌లో కోహ్లీనీ రెచ్చ‌గొడితే ఆస్ట్రేలియా త‌గిన మూల్యం చెల్లించుకుంటుంద‌ని హెచ్చ‌రించారు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకి భారత్ జట్టు వెళ్లగా.. కోహ్లీ తాను ఆడిన మూడు టెస్టుల్లో ఏకంగా 286 పరుగులతో సత్తాచాటాడు. అయితే.. అవి చాలా తక్కువని.. తమ క్రికెటర్లు సిరీస్‌లో సైలెంట్‌గా ఉండటంతోనే.. కోహ్లీని ఆ మాత్రమైనా కట్టడిచేయగలిగామని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రత్యర్థి కవ్వింపులను సవాల్‌గా తీసుకుని ఆడే క్రికెటర్లు తక్కువగా ఉన్నారు. భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జాబితాలోకి వస్తాడు. అతను ప్రత్యర్థితో ఢీకొట్టడాన్ని బాగా ఆస్వాదిస్తాడు. అందుకే.. సిరీస్ ఆరంభానికి ముందే మేము అతడ్ని రెచ్చగొట్టకూడదని జట్టు సమావేశంలో నిర్ణయించుకున్నామ‌ని అందుకే టెస్ట్ సిరీస్‌ను గెలిచామ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -