Friday, May 17, 2024
- Advertisement -

మూడో టెస్ట్‌లో స‌త్తా చాటిన కెప్టెన్, వైస్ కెప్టెన్‌

- Advertisement -

ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టెస్ట్‌ల్లోనూ ప‌రాజ‌యం పాలైంది టీంఇండియా. దీంతో నిర్ణయాత్మ‌క మూడో టెస్ట్‌లో ఇండియ‌న్ బ్యాట్‌మ్యాన్స్ త‌మ స‌త్త చాటారు. నివారం ఆరంభమైన మూడో టెస్టులో తొలిరోజే 307 స్కోరుతో ఇంగ్లాండ్‌‌కి ఊహించని షాకిచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ( 97) వైస్ కెప్టెన్ అజింక్య రహానె (81) కొద్దిలో శతకాలనుచేజార్చుకున్నా,బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో భారత్‌ని మెరుగైన స్థితిలో నిలిపారు.

దీంతో.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 307/6తో నిలవగా.. క్రీజులో రిషబ్ పంత్ (22 బ్యాటింగ్ ) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు క్రిస్‌వోక్స్ మూడు, ఆదిల్ రషీద్, స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ తలో వికెట్ పడగొట్టారు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడిన రిషబ్ పంత్ సిక్స్‌తో తన పరుగుల ఖాతాని తెరిచి చివరి వరకూ అదే జోరుని కొనసాగించాడు.ఆట మరో నిమిషంలో ముగుస్తుందన్న దశలో హార్దిక్ పాండ్య ఔట్ అవ్వ‌గా తొలి రోజు ఆటని అంపైర్లు నిలిపివేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -