Sunday, May 19, 2024
- Advertisement -

భార‌త బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించిన కీవీస్‌…టీమిండియాకు భారీ టార్గెట్‌

- Advertisement -

మూడు టీ-20ల‌ సిరీస్‌లో భాగంగా వెస్ట్‌ప్యాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టీ-20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్లు భార‌త బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తూ.. భారత్‌కు భారీ టార్గెట్‌ని ముందుంచారు. టాస్ గెలిచి రోహిత్ సేన పీల్డింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఓపెనర్లు కోలిన్ మున్రో, టిమ్ షైఫెర్ట్ మంచి ఆరంభాన్ని అందించారు. బ్యాటింగ్ పవర్‌ప్లేలో భారత బౌలర్లకు చుక్కలు చూపించి 66 పరుగులు చేశారు. ఈ దిశలో మున్రోను అవుట్ చేసిన క్రునాల్ పాండ్యాకు టీమిండియాకు తొలి బ్రేక్ అందించాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్స్‌సన్‌తో జతకలిసిన సిఫర్ట్ బౌండరీలతో చెలరేగిపోయాడు.

43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 84 పరుగులు చేసిన షైఫెర్ట్.. ఖలీల్ అహ్మద్ వేసిన 13వ ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మిషెల్(8) హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.

ఆఖర్లో రాస్ టేలర్(23), స్కౌట్ కుగ్లిజిన్(20) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో పాండ్యా 2, భువనేశ్వర్, ఖలీల్, కృనాల్, చాహల్ తలో వికెట్ తీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -