Friday, May 17, 2024
- Advertisement -

ఈ రోజు మ్యాచ్.. కోహ్లి ప్లాన్ సూపర్ హిట్.. ఔట్ అయిన లాథమ్

- Advertisement -

వాంఖడేలో గత ఆదివారం ముగిసిన తొలి వన్డేలో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో భారత స్పిన్నర్లని షాక్ ఇచ్చిన కివీస్ బ్యాట్స్‌మెన్ టామ్ లాథమ్.. పుణే వన్డేలో విరాట్ కోహ్లీ ప్లాన్ కి మంచిగానే చిక్కాడు. వాంఖడే శతక ఫామ్‌ని కొనసాగిస్తూ లాథమ్ (38: 62 బంతుల్లో 2×4) ఈ వన్డేలో కూడా స్వీప్ షాట్స్ ఆడినా.. అక్షర్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.

స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఈ బ్యాట్స్‌మెన్ తొలి వన్డేలో స్వేచ్ఛగా స్వీప్ షాట్స్ ఆడటంతో.. ఈ వన్డేకి అతని స్థానంలో అక్షర్ పటేల్‌ని తుది జట్టులోకి కోహ్లి తీసుకొచ్చాడు. స్పిన్నర్లు చాహల్, కేదార్ జాదవ్ ఆఫ్ స్టంప్‌, మిడిల్ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని వరుసగా టామ్ లాథమ్‌కి బంతులు విసిరారు. దీంతో ఈ బ్యాట్సె‌మెన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వరసగా స్వీప్ షాట్స్ ఆడి పరుగులు తీసాడు. అయితే.. కెప్టెన్ కోహ్లీతో చర్చించిన అక్షర్ పటేల్ 30వ ఓవర్‌లోని తొలి బంతినే లెగ్ స్టంప్‌ని లక్ష్యంగా చేసుకుని విసిరాడు.

ఈ ప్లాన్ పసిగట్టిన లాథమ్.. చాహల్, జాదవ్ బౌలింగ్ లో ఆడినట్లే స్వీప్ షాట్ కోసం ఆఫ్ స్టంప్ పైకి వెళ్లి బంతి అందకపోవడంతో క్లీన్ బౌల్డయ్యాడు. గుడ్డిగా బ్యాట్ లేపాడు.. ఔటైన లాథమ్ క్రీజులోనే అలానే కాసేపు తలవాల్చేసి తర్వాత పెవిలియన్ బాట పట్టాడు. ఆ టైంకి న్యూజిలాండ్ స్కోరు 29.1 ఓవర్లలో 118/5.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -