Thursday, May 16, 2024
- Advertisement -

క‌ష్టాల్లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌…గాయం కార‌నంగా స్టార్ బౌల‌ర్ దూరం

- Advertisement -

ఐపీఎల్‌ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. ఇప్పటికే భుజ గాయంతో మరో ఆసీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ క్రిస్‌లీన్‌ దూరమైన విషయం తెలిసిందే.

తాజాగా ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ కుడి కాలి ఎముకలో తీవ్రమైన నొప్పి వల్ల అతడు జోహాన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరం అయ్యాడు. దీంతో పాటు త్వరలో ఆరంభంకానున్న ఐపీఎల్‌కు అందుబాటులో ఉండేది అనుమానమేనని. ఆస్ట్రేలియా క్రికెట్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.

అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ పేసర్లలో ఒకడైన స్టార్క్‌ను జనవరిలో నిర్వహించిన వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.9.4 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లాడిన అతడు 7.17 ఎకానమీ రేట్‌తో 34 వికెట్లు తీశాడు. ఇప్పటికే కోల్‌కతా జట్టులో ఉన్న క్రిస్‌లిన్, ఆండ్రూ రస్సెల్ గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తాజాగా స్టార్క్ దూరమవడం దినేశ్ కార్తీక్ నాయకత్వంలోని కోల్‌కతా భారీ ఎదురుదెబ్బే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -