Friday, May 17, 2024
- Advertisement -

హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్‌గా కేన్ విలియ‌మ్‌స‌న్‌…

- Advertisement -

సన్ రైజర్స్ నూతన సారథిగా కేన్ విలియమ్సన్ ఎంపికయ్యాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా డేవిడ్ వార్నర్ ఐపీఎల్‌కు దూరం కావడంతో… అతడి స్థానంలో కేన్ విలియమ్స‌న్‌ను నియమిస్తూ.. సన్‌రైజర్స్ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో విలియమ్సన్ జట్టును ముందుకు నడిపిస్తాడని సన్‌రైజర్స్ సీఈవో కె.షణ్ముగం తెలిపారు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉందని కేన్ చెప్పాడు. సవాల్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ కివీస్ సారథి చెప్పాడు.

డేవిడ్ వార్న‌ర్‌కు బాస‌ట‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున వార్నర్ కెప్టెన్సీలో ఆడిన విలియమ్సన్.. వార్నర్‌ స్వతహాగా చెడ్డ వ్యక్తి కాదని స్పష్టం చేశాడు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఈ చర్యను ఏ జట్టూ సమర్థించదు. కానీ వార్నర్ చెడ్డ వ్యక్తి కాదు. అతడు తప్పు చేశాడు, దాన్ని ఒప్పుకున్నాడు. అలా చేసినందుకు వార్నర్‌ చాలా ఆవేదన చెందాడు. ట్యాంపరింగ్‌ ఉదంతం తర్వాత వార్నర్‌తో నేను టచ్‌లోనే ఉన్నాను’ అని విలియమ్సన్ తెలిపాడు.

కెప్టెన్సీ రేసులో విలియమ్స‌న్‌తోపాటు ధావన్, షకీబుల్ హసన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ విలియమ్సన్‌కు న్యూజిలాండ్ జట్టు కెప్టెన్‌గా అనుభవం ఉండటంతోపాటు సౌమ్యుడిగా పేరుంది. దీంతో అతడివైపే హైదరాబాద్ ఫ్రాంచైజీ మొగ్గు చూపింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -