Thursday, April 25, 2024
- Advertisement -

ఆ నలుగురి బాటలోనే నడుస్తా: పుజార

- Advertisement -

సంప్రదాయ టెస్టు బ్యాట్స్‌మన్‌కు పెట్టింది పేరైన చతేశ్వర్‌ పుజారా తాజా ఐపీఎల్‌ సీజన్‌కు అందుబాటులోకి వస్తున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ నయా వాల్‌ను ఐపీఎల్‌ 2021 కి ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్న పుజారా గతంలో కంటే మెరుగ్గా ఐపీఎల్‌లో రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. టీ 20ల్లో తను విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలిమ్సన్‌ ఆటతీరును అనుసరిస్తానని చెప్తున్నాడు. వారంతా పవర్‌ హిట్టింగ్‌ చేయకపోయిన సంప్రదాయ క్రికెటింగ్‌ షాట్లతో పరుగులు సాధిస్తారని, అదే బాటలో తాను కూడా నడుస్తానని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుజారా పేర్కొన్నాడు.

ఏడేళ్ల అనంతరం….
2014 ఐపీఎల్‌లో ఆడిన పుజారా మళ్లీ ఏడేళ్ల అనంతరం టీ20ల్లో ఆడనున్నాడు. అప్పటి ఐపీఎల్‌లో 99.74 స్ట్రైక్‌ రేట్‌తో పరుగులు సాధించడం పట్ల మాట్లాడుతూ.. అలాంటి పొరపాట్లు మళ్లీ జరగనీయనని అన్నాడు. టీ20లకు అనుగుణంగా బ్యాటింగ్‌లో మార్పులు చేస్తే.. తన టెస్టు క్రికెట్‌కు ఇబ్బంది కలుగుతుందేమోననే అపోహతో అప్పుడలా ఆడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. రాహుల్‌ ద్రావిడ్‌ సూచనలు కూడా నాకు కలిసి వస్తాయని పుజారా చెప్పుకొచ్చాడు.

పవర్‌ హిట్టింగ్‌ గురించి ఆలోచించక విభిన్న షాట్లు ఆడుతూ పరుగులు సాధించొచ్చని ద్రావిడ్‌ సలహా ఇచ్చినట్టు తెలిపాడు. సంప్రదాయక క్రికెట్‌ ఆడుతూనే విభిన్న షాట్లతో పరుగులు రాబట్టడం నేర్చుకున్నాని క్రిక్‌ ఇన్‌ఫో ఇంటర్వ్యూలో పుజారా వివరించాడు. టెస్టు క్రికెట్‌ ఆడిన అనుభవంతోనే టీ20ల్లోనూ రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. టెస్టుల్లో వికెట్‌కు ప్రాధాన్యం ఉంటుందని, టీ20ల్లో భిన్నమైన షాట్లతో మనమేంటో తెలియజేయాల్సి ఉంటుందని అన్నాడు.

గుడ్డుతో ఆ లాభం కూడా వుందట..!

ఒకే రోజు 93 వేల కేసులు.. 500కు పైగా మ‌ర‌ణాలు

తిరుపతిలో పవన్‌ సభ సక్సెస్‌, ఆనందంలో వైసీపీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -