భారత్ తో తొలి టెస్టులో విజయం సాధించి జోరు మీదున్న ఇంగ్లండ్ కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. టీమిండియాతో ఫిబ్రవరి 13 నుంచి జరగనున్న రెండో టెస్టుకు ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ దూరం కానున్నాడు. రొటేషన్ పాలసీలో భాగంగా అతన్ని తప్పిస్తున్నట్టు తెలిసింది. అండర్సన్ స్థానంలో స్టువర్ట్ బ్రాడ్‌కు అవకాశం ఇవ్వనున్నట్టు ఈసీబీ ఒక ప్రకటన లో పేర్కొంది. కాగా, ఈసీబీ రొటేషన్ పాలసీని కచ్చితంగా అమలు చేస్తుంది. ఆటగాడు మంచి ఫామ్‌లో ఉన్నా సరే అతన్ని పక్కనబెట్టి మరొక ఆటగాడికి చాన్స్ ఇస్తుంది. ఇక చెన్నైలోని ఎం. ఏ. చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆండర్సన్ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆట చివరిరోజు అద్భుతంగా బౌలింగ్ చేసి గిల్, రహానే, పంత్ వికెట్లు తీసిన అండర్సన్ 11-4-17-3 తో అద్భుత గణాంకాలు నమోదు చేశాడు.
మరోవైపు అండర్సన్‌ను పక్కనబెట్టడం తమకు ఇష్టం లేదని ఇంగ్లండ్ హెడ్‌కోచ్ క్రిస్ సిల్వర్‌ఉడ్ అన్నాడు. అయినప్పటికీ రొటేషన్ పాలసీ అమలు తప్పదని చెప్పుకొచ్చాడు. రొటేషన్ పద్దతిలో ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడం వల్ల తర్వాతి మ్యాచ్‌కు ఉత్సాహంగా బరిలోకి దిగే అవకాశం ఉంటుందని అన్నాడు. ఇక బ్యాటింగ్‌లో జాస్ బట్లర్ కూడా రెండో టెస్టుకు దూరమవడం ఖాయంగా తెలుస్తోంది. అతని స్థానంలో జానీ బెయిర్ స్టో లేదా ఫోక్స్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
Also Read
వాళ్లు సూచిస్తేనే ఇక్బాల్‌ను కెప్టెన్ చేశా
నువ్వా..? నేనా ? అంటూ పోటిపడుతున్న మహేష్ బాబు, ప్రభాస్
30 ఏళ్ల కష్టాన్ని.. అర్థ గంట లో దోచేశారు..!
వాలంటైన్ వీక్.. స్పెషల్స్ ఏంటో మీరూ చూడండి