Tuesday, April 30, 2024
- Advertisement -

టీమిండియాకు అసలైన సవాల్.. రోహిత్ సేన ప్లానేంటి ?

- Advertisement -

టి20 వరల్డ్ కప్ లో భారత్ అద్బుతమైన ఫామ్ కొనసాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ విభాగాల్లోనూ టీమిండియా అత్యుత్తమంగా రానిస్తోంది. ఇక సూపర్ 12 లో ఒక్క సౌతాఫ్రికా మినహా మిగిలిన నాలుగు జట్లపై చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది. దాంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్ లోకి దర్జాగా అడుగుపెట్టింది. అయితే టీమిండియాకు అసలైన పరీక్ష సెమీస్ లోనే ఎదురుకానుంది. ఈ నెల 10 న జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ తో తలపడనుంది టీమిండియా. .

మరి ఇంగ్లండ్ జట్టు మొత్తం అల్ రౌండర్లతో దుర్బెద్యమైన లైనప్ కలిగి ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ విభాగాల్లోనూ అద్భుతంగా రానిస్తూ ప్రత్యర్థి జట్లకు పెను సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ జట్టును ఎదుర్కోవడం అంతా తేలికైన విషయం కాదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇంగ్లండ్ జట్టుపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన రోహిత్ సేనకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇక టీమిండియా ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్య మినహా మిగిలిన ఆటగాళ్లందరు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో వీరిద్దరు కూడా ఫామ్ లోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు.

ఇక విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ భీకర ఫామ్ ను అలాగే కొనసాగిస్తే ఇంగ్లండ్ ను ఎదుర్కోవడం పెద్ద విషయమేమి కాదు. టీమిండియా బౌలర్లు కూడా అత్యుతమ ప్రదర్శన కనబరుస్తున్నారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ టీమిండియా ప్రదాన అస్త్రం అని చెప్పుకోవచ్చు. అలాగే భువనేశ్వర్ కూడా ఫుల్ ఫామ్ లో ఉండడం భారత్ కు కలిసొచ్చే అంశం. కాగా గత వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించిన టీమిండియా.. ఈసారి సెమీస్ లో అడుగుపెట్టింది. మరి సెమీస్ లో విజయ పరంపర ను కొనసాగిస్తూ ఫైనల్ కు దూసుకెళుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -