Wednesday, May 15, 2024
- Advertisement -

పెళ్లికి ముందు సానియా మిర్జాకు ఉన్న ఎఫైర్ గురించి ఏం చెప్పిందంటే..?

- Advertisement -
sania mirza reviled her affair

ఇత‌ర‌త్రా అంశాలు, కాంట్ర‌వ‌ర్సీ విషయాలతో.. ప్ర‌ముఖ టెన్నిస్ క్రీడాకార‌ణి సానియా మీర్జా వార్త‌ల్లో కనిపిస్తోంటుంది. అయితే రీసెంట్ గా సానియా.. ఓ స్టార్ హీరోతో త‌న‌కు ఎఫైర్ ఉన్న‌ట్టు వ‌చ్చిన రూమార్స్ పై స్పందించింది. ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాం లో పాల్గొన్న సానియా మీర్జా.. పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది.

ఈ ప్రోగ్రాంలో కరణ్ జోహార్ సెల‌బ్రిటీల వ్య‌క్తిత్వంపై కూడా ఘాటుగా, హాటుగా ప్ర‌శ్న‌లు వేస్తూ వారి నుంచి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు రాబ‌ట్టిన విషయం తెలిసిందే. ఈ నెపథ్యంలో కరణ్ జోహార్ సానియాను గతంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో నడిపిన లవ్ ఎఫైర్ పై ప్ర‌శ్నించాడు. పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకున్న సానియా మీర్జా.. షాహిద్ కపూర్ తో ప్రేమాయణంపై వ‌చ్చిన.. వార్త‌ల‌పై స్పందించింది.

ఆ వార్తలు ఎన్నో ఏళ్ల క్రితం వచ్చాయని, అవేమీ నిజం కాదని, తాను షాహిద్ తో డేటింగ్ చేయలేదని స్పష్టం చేసింది. ఇక ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో భాగంగా షాహిద్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్లలో ఎవరిని వివాహం చేసుకుంటావని అడుగగా, అవకాశం లభించి వుంటే రణబీర్ కపూర్ ను చేసుకుని ఉండేదాన్నని తనదైన స్టైల్లో స‌మాధానం చెప్పింది. ఇక ఈ ముగ్గురిలో ఎవరినైనా చంపే చాన్స్ వస్తే షాహిద్‌ను చంపేస్తాన‌ని తెలిపింది.

Related

  1. వరుణ్ తో ఎఫైర్‌ పెట్టుకున్న బిందు మాధ‌వి.. త్రిషకి ఏం సంబంధం..?
  2. షాకింగ్.. రవితేజ్ త్వరలో డిశ్చార్జ్ కానున్నాడట!!
  3. పాపం నిహారిక.. ఆశలు వదిలేసుకుందా…??
  4. యాంకర్ రవి ఆ హీరోయిన్ డేటింగ్ లో చాలా బిజీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -