Thursday, May 2, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపిన వైసీపీ

- Advertisement -
ysrcp greensignal friendship with pawan

ఏపీ కోసం ప్ర‌త్యేక హోదా తెచ్చేందుకు వైసీపీతోనే అయిన క‌లిసి ప‌నిచేసేందుకు తాను సిద్ధం అంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేసిన ప్ర‌క‌ట‌న ఏపీ రాజ‌కీయాల్లో సంచలనం గా మారింది. అయితే పవన్ ఈ ప్ర‌క‌ట‌న చేసిన దగ్గర నుంచి ఏపీ ఇన్న‌ర్ పాలిటిక్స్‌లో.. జ‌న‌సేన, వైసీపీకలుస్తాయంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న చేసిన తర్వాత వైసీపీ నాయ‌కులు ప‌వ‌న్‌తో క‌లిసి వెళ్లేందుకు అయిష్ట‌త వ్య‌క్తం చేస్తూ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. అయితే ఇప్పుడు వైసీపీకి చెందిన ఓ సీనియ‌ర్ లీడ‌ర్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మాత్రం ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేసే విషయం పై పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేస్తున్న పాలనను అడ్డుకునేందుకు జనసేన, సీపీఐ, సీపీఎం తదుతర పార్టీలు పొత్తుకు రెడీ అయ్యాయని విజయసాయి రెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఎవరు వచ్చిన స్వాగతిస్తామని విజయసాయి అన్నారు.

అలాగే ఏపీకి ద్రోహం చేసిన కాంగ్రెస్‌తో పాటు బీజేపీతో క‌లిసి పనిచేయడానికి రెడీగా లేమని ఆయన అన్నారు. ఇక ప్ర‌త్యేక హోదా కోసం ఫైట్ చేస్తోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌మ‌తో చేతులు క‌లుపుతామ‌ని అంటే కాద‌న‌డం ఎందుక‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు. సో మొత్తంగా వైసీపీ ప‌వ‌న్‌తో క‌లిసి ప‌ని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మ‌రి 2019లో ఏపీ రాజకీయాల్లో స‌రికొత్త పొత్తుల లెక్క‌న చూడబోతున్నాం అని తెలుస్తోంది.

Related

  1. పవన్, జగన్ కలవనున్నారా..?
  2. పవన్ కాటమరాయుడు టీజర్ అదిరింది!
  3. బాహుబలికి షాక్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌!
  4. ఎన్టీఆర్ వర్సెస్ పవన్.. పోటీలో గెలుపు ఎవరిది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -