Monday, May 20, 2024
- Advertisement -

సన్‌ రైజర్స్ వీరంగం..

- Advertisement -

ఐపీఎల్ 2024లో భాగంగా విధ్వంసం సృష్టించింది సన్ రైజర్స్. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించి లక్నో బౌలర్లకు పీడకలను మిగిల్చారు ఎస్‌ఆర్‌హెచ్ బ్యాట్స్‌మెన్. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో అద్భుత ఆటతీరు కనబర్చారు. లక్నో విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేశారు.

ట్రావిస్‌ హెడ్‌ 30 బంతుల్లో 8 సిక్స్‌లు, 8 ఫోర్లతో 89 నాటౌట్‌,అభిషేక్‌శర్మ 28 బంతుల్లో 6 సిక్స్‌లు,8 ఫోర్లతో 75 నాటౌట్‌గా నిలిచి లక్నో బౌలర్లను ఉచకోత కోశారు. వీరిద్దరి ధాటికి ప్రేక్షకుల్లా మారిపోయారు లక్నో ఆటగాళ్లు. ఏ మాత్రం కనికరం చూపించకుండా పరుగుల వరద పారించారు. కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేశారంటే వీరిద్దరి విధ్వంసం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 165 పరుగులు చేసింది. బదోని 30 బంతుల్లో 55 నాటౌట్‌, నికోలస్‌ పూరన్‌ 26 బంతుల్లో 48 నాటౌట్‌ రాణించడంతో లక్నో ఆ మాత్రం స్కోరైనా చేయలగలిగింది. అర్ధసెంచరీతో అదరగొట్టిన హెడ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -