Friday, May 17, 2024
- Advertisement -

ధోనీ, కోహ్లీ అనుబంధం‌ గురించి వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర విషయాలు

- Advertisement -

భారత మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత కెఫ్టెన్ విరాట్ కోహ్లీ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికి తెలిసిందే. మైదనంలో ఏం అవసరం ఉన్న కోహ్లి వెంటనే ధోని ని అడుగుతాడు. ధోని అనుభవాలను ఉపయోగించుకుంటాడు. ధోనీ కూడా కోహ్లీకి సలహాల ఇస్తుంటాడు.

ఈ ఇద్దరి కాంబినేషన్ లో భారత్ జట్టు ఎన్నో విజయాలను అండుకుంది. ఈ క్రమంలో ధోనీ, కోహ్లీకి మధ్య మైదానంలో అనుబంధంపై వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికర విషయాలు తెలిపాడు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం భారత జట్టుకు ఎలా లాభదాయకమో వివరించారు. ‘పుణె మ్యాచ్‌లో వారిద్దరి మధ్య అనుబంధాన్ని మరోసారి చూశాం. కోహ్లి దూకుడు, ధోనీ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. వన్డే, టీ20 ఫార్మాట్‌కు ధోనీ రాజీనామా చేసి, కోహ్లీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పటి నుంచి జట్టులో అద్భుతాలు జరుగుతున్నాయి. ధోనీ వికెట్ కీపర్ గా ఉండటం ఆయనకు కలిసొచ్చే విషయం. ఇది కోహ్లీ మైదానంలో ఫీల్డింగ్ సరిచేయడంలో ధోనీ సలహాలు తీసుకునేలా చేస్తున్నది.

ధోనీ వికెట్ల వెనక నుంచి వివిధ కోణాల్లో ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్‌ను సెట్ చేయగలుగుతున్నాడు. కోహ్లీ కెఫ్టెన్ అయినప్పటికి ధోనిని సంప్రదిస్తున్నందుకు అతనిని అభినందించాల్సిందే. 2019 వరల్డ్‌కప్‌ భారత జట్టుకు వస్తుందని నేను భావిస్తున్నా. ధోనీకి జట్టులో ఎంతో గౌరవం ఉంది. దీంతో కోహ్లీ ఎంఎస్‌పై ఆధారపడుతున్నాడు. భారత జట్టుకు ధోనీ మార్గదర్శి. వరల్డ్ కప్ లో వీరి అనుబంధం జట్టుకు మేలు చేస్తుందని’ లక్ష్మణ్ తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -