Tuesday, May 21, 2024
- Advertisement -

11 ఏళ్ల పరుగుల మిషన్ కోహ్లీ క్రికెట్ ప్రస్థానం….

- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి ఇప్పటికి 11 ఏళ్లయ్యింది. 2008, ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ప్రపంచ అగ్రసేన శ్రేణి బ్యాట్ష్ మెన్ గా వెలుగొందుతున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ-20లు కలిపి 68 సెంచరీలు, 95 హాఫ్ సెంచరీలతో మొత్తం 20, 502 పరుగులు సాధించాడు.

భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల క్రికెటర్ల జాబితాలో సచిన్ తరువాత రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తన కెరీర్ మొదలై 11 సంవత్సరాలు అయిన సందర్భంగా, అప్పటి ఫొటోను జతచేస్తూ, కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టగా అది వైరల్ అయింది.

మొత్తం 239 వన్డేలాడిన అతడు 77 టెస్టులు, 70 అంతర్జాతీ టీ20లు పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ(11,363)ని ఇటీవలే కోహ్లి(11,520) వెనక్కి నెట్టాడు.దశాబ్దాల రికార్డుల బూజు దులుపుతున్న విరాట్ కోహ్లీ.. మరో ఐదేళ్లపాటు క్రికెట్ ఆడితే..? టెండూల్కర్ శతకాల రికార్డులు బద్దలవడంతో పాటు మరిన్ని సరికొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -