Friday, May 17, 2024
- Advertisement -

ఏపీ, తెలంగాణాలో నియేజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న సురూ

- Advertisement -
BJP eyes  on  Andhra Pradesh,Telangana

తెలంగాణా,ఏపీ రాస్ట్రాల్లో  నియేజ‌క వ‌ర్గాల పుణ‌ర్విభ‌జ‌న‌కు రంగం సిధ్ద‌మైంది. దీనికి సంబందించిన పైల్ ఇప్ప‌టికే త‌యార‌యిన‌ట్లు స‌మాచారం. మొద‌ట నియేజ‌క వ‌ర్గాల పుణ‌ర్విభ‌జ‌న‌కు ఒప్పుకోనీ కేంద్రం ఇప్పుడు సానుకూలంగా నిర్ణ‌యం తీసుకుంది.

ఉత్త‌రాది రాష్ట్రాల‌లో దూసుకు పోతున్న బీజేపీ ద‌క్షిణాది రాష్ట్రాలైన ఏపీ ,తెలంగాణాలో పాగా వేయాల‌న్న రాజ‌కీయ వ్యూహాల్లో భాగంగానే కేంద్రం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెల‌స్తోంది. నియేజ‌క వ‌ర్గాల‌పెంపుపై ఇరు రాష్ట్రాలు చేసిన విజ్ణ‌ప్తుల‌కు కేంద్రం సానుకూలంగా స్పందించ‌డంతో త్వ‌ర‌లోనే పుణ‌ర్విభ‌జ‌న‌కు ప‌చ్చ‌జెండా ఊపి, ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌న‌కోసం నోటిపికేష‌న్ ను వెలువ‌రించేందుకు రంగం సిధ్ద‌మైన‌ట్లు స‌మాచారం.

రాష్ట్ర విభ‌జ‌న  బిల్లులో లోక్ స‌భ‌, శాస‌న నియేజ‌క‌వ‌ర్గాల పుణ‌ర్విభ‌జ‌న విభ‌జ‌న బిల్లులో పొందుప‌రిచిన విష‌యం తెలిసిందే.నియేజ‌క వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేయాల‌నీ ఇరు రాష్ట్రాలు ఇప్ప‌టికే కేంద్రానికి చేసిన విజ్న‌ప్తులకు కేంద్రం ప‌చ్చ‌జెండా ఊప‌డంతో దీనికి సంబందించిన క‌స‌ర‌త్తులు రాష్ట్ర ప్ర‌భుత్వం మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. 2019  ఎన్నిక‌ల‌కు రెండు సంవ‌త్స‌రాలే గ‌డువు ఉండ‌టంతో ఈ ఏడాదిలోనే పునర్విభజన ప్రక్రియ మొత్తం పూర్తి చేయా లనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేస్త్తోంది. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ల ద్వారా కొత్త నియోజకవర్గాల రూపురేఖలను తయారుచేయించి రాజధానికి ఫైళ్ళు తెప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. పునర్విభజనకు సంబంధించిన నిబంధనలు, నియోజకవర్గాల సరిహద్దుల నిర్ణయంపైనా, జనాభా పరిమితి ఇతరత్రా మొత్తం ప్రక్రియపైనా జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ ఉద్యోగులకు పూర్తి అవగాహన ఉంది. దీంతో రాజధాని నుంచి ఆదేశాలు అందగానే తదనుగుణంగా కొత్తగా నియోజకవర్గాలు ఎలా ఉంటాయన్నది రూపొందించారు.

ప్ర‌స్తుతం ఏపీలో 175 శాస‌న స‌భ నియేజ‌క వ‌ర్గాలు ఉండ‌గా వాటిని 225 పెంచాల‌నీ ప్ర‌తిపాద‌న‌లు రూపొందించింది ప్ర‌భుత్వం.. తాజా ప్రతిపాదనల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 నియోజకవర్గాలను 13 నియోజకవర్గాలుగా ను, విజయనగరంలో ప్రస్తుతం ఉన్న 9 నియోజకవర్గాలను 11 నియోజకవర్గాలుగా, విశాఖపట్నంలో 15 నియోజకవర్గాలను కొత్తగా 20 నియోజకవర్గాలుగా రూపొందించినట్లు సమాచారం. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలను 25 నియోజకవర్గాలగా, పశ్చిమగోదావరిలో 15 నియోజకవర్గాలను 19 నియోజకవర్గాలు పెంచినట్లు తెలిసింది. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 16 నియోజకవర్గాలను కొత్తగా 20 నియోజకవర్గాలుగాను, గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాలను 22కు పెంచినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాల స్థానంలో 15, శ్రీపొట్టిశ్రీరా లు నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న 10 స్థానాలను 13కు పెంచినట్లు తెలిసింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలను 18గా, కడపలో 10 స్థానాలను 13కు, కర్నూలులో 14ను 18 నియోజకవర్గాలుగా, అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఉన్న 14శాసనసభ నియోజకవర్గాలకు మరో 4 జోడించి మొత్తం 18 నియోజకవర్గాలుగా ముసాయిదాను సిద్ధం చేసిపెట్టుకున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -