Sunday, May 19, 2024
- Advertisement -

చిరిగిపోయిన చీపురు.. పుల్ల‌ల్ని ఏరుకుంటున్న కేజ్రీ….

- Advertisement -
BJP Victory in Delhi Municipal Elections

మాట‌లు చెప్పినంత తేలియ కాదు చేత‌ల్లో చేసి చూప‌డానికి. దానికి రాజ‌కీయ అనుభ‌వం,ప్ర‌జా స‌మ్య‌ల‌మీద అవ‌గాహ‌న చిత్త‌శుద్ది ఉంటే త‌ప్ప అది సాధ్యం కాదు. దేశంలో ఉన్న అవినీతి నంతా ఒకే సారి చీపురుతో ఉడ్చేస్తానంటూ ఆయ‌న చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అంతే కాదు దేశ రాజ‌కీయాల్లో ఒక సంచ‌ల‌నాల‌కు తెర‌తీశారు… ఇప్ప‌టికే ఆయ‌న ఎవ‌రో ఈపాటిక మీకు అర్థ‌మ‌య్యే ఉంటుంది.ఆయ‌నే ఆమ్ ఆద్మీపార్టీ అధినేత,ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్.

రాజకీయాల్లోకి వస్తూనే ముఖ్యమంత్రి అయిపోయిన కేజ్రీవాల్‌, మొదట్లో సరైన మెజార్టీ రాకపోవడంతో, 50 రోజులు గడవకముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, తిరిగి ఎన్నికలకు వెళ్ళారు. ఈసారి ప్రభంజనమే సృష్టించారాయన. రికార్డ్‌ స్థాయి మెజార్టీతో రెండోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన తర్వాతే అసలు కథ మొదలయ్యింది. అధికారం చేతికి రావటం ఎంత కష్టమో.. చేతికి వచ్చిన పవర్ ను చేజారకుండా ఉంచుకోవటం అంత తేలికైన విషయం కాదు. అందుకే ఓడిన వాడి కంటే విజయం సాధించిన వారు మరింత ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది.

ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్య నేతల్లో పలువురు వివిధ కేసుల్లో ఇరుక్కుపోయారు. ఇందులో లైంగిక వేధింపుల ఆరోపణలూ వుండడం గమనార్హం. అలా ఆమ్‌ ఆద్మీ పార్టీ వెలుగులు రోజురోజుకీ తగ్గిపోయాయి. ప్రస్తుతం అటు కేజ్రీవాల్‌ ఇమేజ్‌, ఇటు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇమేజ్‌ మసకబారిపోతుండడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన బీజేపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా షాకిచ్చారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి ఓటర్లు. మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఢిల్లీ రాష్ట్రంలో ఏకంగా 57 స్థానాల్లో ఆమ్ ఆద్మీపార్టీ సంచలన విజయాన్ని సాధించగా.. కేవలం మూడంటే మూడు స్థానాల్లో మాత్రం బీజేపీ గెలవగలిగింది. తాజాగా జ‌రిగిన ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్న‌క‌ల్లో అదే చీపురుతో కేజ్రీవాల్ ప్ర‌భుత్వాన్ని ఊడ్చి పాడేశారు. బీజేపీ, ఈ ఎన్నికల్లో ఎదురులేని శక్తిగా నిలిచింది.

అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీతో, కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానానికి పోటీ పడాల్సి వచ్చింది. షరామామూలుగానే, ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణమని ఆమ్‌ ఆద్మీ పార్టీ బుకాయిస్తోంది. ‘ఇది మోడీ మేనియా కాదు.. ఈవీఎం మేనియా.. ఈవీఎంలను మోడీ నడిపిస్తున్నారు.. అలాంటప్పుడు గెలుపు బీజేపీది కాక, ఇంకెవరిదవుతుంది.. అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. అధికారం చేతికి వ‌చ్చింది క‌దానీ విర్ర వీగుతే ఏవ‌రికైనా కేజ్రీవాల్‌కు ప‌ట్టిన గ‌తే ప‌డుతుంద‌ని ఢిల్లీ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప‌లితాలు నిద‌ర్శ‌నం.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్ర‌శాంత్ కిషోర్‌తో డీల్… 2019 ఎన్నికలకు జ‌గ‌న్ ప‌క్కావ్యూహం..
  2. కేంద్రం సంచలన నిర్ణయం.. జబర్దస్త్ పటాస్ షో లకు షాక్
  3. జగన్ పై లోకేష్ మరో బ్లండర్ మిస్టేక్.. టీడీపీనేతలే నవ్వుతున్నారు
  4. తెలంగాణ లో జనసేన అధ్యక్షుడుగా నితిన్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -