Monday, May 20, 2024
- Advertisement -

లోక‌ల్ … నాన్‌లోక‌ల్ కేటీఆర్ పంచ్ అదిరింది

- Advertisement -
KTR controversial comments on Chandrababu Naidu

తెలంగాణా   ముఖ్య‌  మంత్రి కేసీఆర్ కుమారుడు… మంత్రి  కేటీఆర్  ప్ర‌త్య‌ర్థుల‌పై  పంచ్‌లు వేయ‌డంలో ఆరితేరారు. అక్క‌డ ఎవ‌రు ఉన్నా  స‌రే పంచ్‌ప‌డితే దిమ్మ‌తిర‌గాల్సిందే. స‌మ‌యం సంద‌ర్భం దొరికితే చాలు  మాట‌లు తూటాల్లా పేల్చేస్తారు. తాజాగా కేటీఆర్ మ‌రోసారి పంచ్‌లు విసిరారు.  ఇప్పుడ ఎవ‌రిమీద‌నో కాదు ఏపీ సీఎం నారాచంద్ర‌బాబు నాయుడు నారాలోకేష్ మీద అదిరిపోయే సెటైర్ వేశారు. చాలా రోజుల త‌ర్వాత మీడియాతో ఇష్టాగోషిటిగా మాట్లాడిన కేటీఆర్ ప్ర‌తి ప‌క్ష‌పార్టీల‌పైకూడా పంచ్‌ల విసిరారు.

ఏపీ ఐటీ, మున్సిప‌ల్ శాఖ‌ల‌ను చేప‌ట్టిన మంత్రిగా లోకేష్ బాధ్య‌త‌లు చెపట్ట‌డంపై ప్ర‌స్తావించ‌గా… గ‌తంలో జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో త‌న‌ను లోక‌ల్ అని విమర్శించిన లోకేశ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పరోక్షంగా లోకే్శ్ హైదరాబాద్ నుంచి అమరావతికి మారిపోయారని కామెంట్ చేశారు. అంతే కాదు.. తెలంగాణలో టీడీపీ పని పూర్తిగా ఖతమైపోయినట్టేనని కామెంట్ చేశారు. జ‌గిత్యాల‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లోనూ  మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్  జైత్ర‌యాత్ర జ‌గిత్యాలనుంచే కొన‌సాగుతుంద‌ని అన్నారు జగిత్యాల దెబ్బ ఎలా ఉంటదో గోదావరి పుష్కరాల టైమ్ లో చంద్రబాబుకు తెలిసిందన్నారు. జగిత్యాల దెబ్బతో చంద్రబాబు మన రాష్ట్రం వదిలిపెట్టి పోయాడని ఎద్దేవా చేశారు. 

సీఎం కేసీఆర్ అన్ని వర్గాలవారికి అండ‌గా నిల‌బ‌డ్డార‌ని కేటీఆర్ చెప్పారు. పేదవాళ్లకు సబ్సిడీ ఇవ్వడమంటే తిరోగమన చర్య అని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్-టీడీపీ హయాంలో కరెంట్ ఎప్పుడు వస్తదో..ఎప్పుడు పోతదో తెలియని పరిస్థితి ఉండేదని రైతుల కోసం పట్టపగలు 9 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఘనత తెలంగాణ సర్కారుదని కేటీఆర్ వెల్లడించారు. “ఒకప్పుడు ఎరువులు – విత్తనాల కోసం రైతులు గ‌గ్గోలు పెట్టే వార‌న్నారు.  ఇప్పుడు సకాలంలో రైతులకు ఎరువులు – విత్తనాలు అందిస్తున్నాం. ఉచితంగా ఎరువులు ఇస్తామని చెప్పిన సీఎం.. రైతు పక్షపాతి అని నిరూపించుకున్నారు` అని తెలిపారు. పొరపాటున కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.

చాలారోజుల తర్వాత కేటీఆర్ ఈరోజు లోకేశ్ పై సెటైర్లు వేశారు. మరి దీనికి లోకేశ్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.  తెలంగాణ టీడీపీ నేతలు కూడా హరీశ్ కామెంట్లపై స్పందించే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని అంశాలపైనా కేటీఆర్ కామెంట్లు చేశారు. తనకిప్పుడే ముఖ్యమంత్రి కావాలన్న ఆశలేదని కేటీఆర్ తెలిపారు.

Related

  1. అయేమంలో శిల్పా మొహ‌న్‌రెడ్డి..వైసీపీలోకి మారే యేజ‌న‌
  2. లోకేష్ మంత్రి స్థానంలో ఉండి.. ‘వర్థంతి శుభాకాంక్షలు’ అని ఎవరైనా చెబుతారా?
  3. కొత్త ఇంటిపై బాబును ఏకేసిన పైర్ బ్రాండ్ రోజా!
  4. వంగవీటి పై కేసు.. మళ్లీ మొదలు అయిన రచ్చ.. ఎందుకు ఈ వివాదం..?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -