Monday, May 20, 2024
- Advertisement -

వెట‌కారాన్ని కూడా త‌మ‌కు అన్వ‌యించ‌డంలో లోకేష్ ఘ‌నుడే

- Advertisement -
Nara Lokesh Jokes on Chandrababu Naidu US Tour

అమెరికా అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు. బాబు ఏంటి అమెరికా అధ్య‌క్షుడేంటి ….వీడికేమ‌న్నా మెంట‌లా అని అనుకుంటున్నారా.ఇది వింటె మీకు మ‌తిపోవ‌డం గ్యారంటీ.

చిత్తూరు జిల్లా పుత్తూరులో విజ్ఞాన్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌ వార్షికోత్స‌వానికి సీఎం చంద్ర‌బాబు పుత్ర స‌మేతంగా హాజ‌ర‌య్యారు. అక్క‌డ బాబుగారు ఎప్పుడూ మాదిరే సొంత‌డ‌బ్బా మొద‌లు పెట్టారు.. ఐటీ అనేది మ‌న జీన్స్‌లోనే ఉంద‌ని, డీఎన్ఏ జావా కోడ్‌తో త‌యార‌యింద‌ని.. ర‌క్తంలో లాంగ్వేజీలు ప్ర‌వ‌హిస్తుంటాయ‌ని సెల‌విచ్చారు.

{loadmodule mod_custom,Side Ad 1}

అంత‌వ‌ర‌కు బాగానే ఉంది కాని లోకేష్ గురించి తెలుసుక‌దా. మైకు తీసుకొని ఏంటంటే మొన్న ఏపీలో పెట్టుబ‌డులు, ప‌రిశ్ర‌మ‌లు రాబ‌ట్టేందుక‌ని చంద్ర‌బాబు ఓ వారం రోజులు అమెరికాలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశాడు క‌దా.. అప్పుటడట అక్క‌డ ఉన్న అమెరికా వాళ్లు మీ బాబు అమెరికా అధ్య‌క్షుడిగా పోటీ చేస్తారా అని అడిగార‌ట‌.. ఆ విష‌యాన్ని అక్క‌డున్న వాళ్లు విని ఆశ్చ‌ర్య‌పోయార‌ట‌.. అస‌లు ఆ అమెరికా వాడు ఏ ఉద్ధేశంతో అడిగాడో.. ఈ చిన‌బాబు బుర్ర‌కు ఏం అర్థ‌మ‌యిందో.. దాన్ని తీసుకొచ్చి కాలేజ్ పిల్లోళ్ల ముందు చెప్ప‌డ‌మేమిటో.. ఈ చిన‌బాబు గారు అమెరికాలోనే క‌దా చ‌దువుకొని వ‌చ్చారు.. మ‌రి అమెరికా అధ్య‌క్షుడిగా పోటీ చేయాలంటే ఏ అర్హ‌త‌లు ఉండాలో ఆయ‌న‌కు తెలియ‌దా.. అమెరికా పౌర‌స‌త్వం ఉండొద్దా.. మ‌రీ ఈ స్థాయిలో గొప్ప‌లు చెప్పుకోవ‌డమేమేట‌ని స‌భికులంతా నోరెళ్ల‌బెట్టార‌ట‌.

{loadmodule mod_custom,Side Ad 2}

అస‌లు ఆవిష‌యం ఎందుకు కొచ్చింద‌ని ఆరాతీయ‌గా అక్క‌డ బాబు జ‌నాల‌ను వెంటేసుకొని రాజ‌కీయ క్యాంపులాగా చ‌క్క‌ర్లు కొట్టాడంట‌.న‌లుగురు అధికారులు, ప్ర‌తినిధుల‌ను తీసుకెళ్లి నాలుగు కంపెనీల అధినేత‌ల‌ను క‌లిసి ఏపీ రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టండ‌ని హుందాగా ఆహ్వానించాల్సింది పోయి ఈయ‌న‌గారు అక్క‌డ ఏదో ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్ నిర్వ‌హించిన‌ట్టు వంద‌ల మంది మూక‌ను వెంటేసుకుని తిర‌గాడ‌ట‌. కొంద‌రు అయితే అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి పార్టీ మీటింగ్‌ల లాగా కొంద‌రు ప‌చ్చ జెండాలు ఒంటికి క‌ప్పుకుని చంద్ర‌బాబు కాన్వాయ్‌ను అనుస‌రించార‌ట‌.
ఇదంతా చూసి ఏందీ అల్ల‌రి ఇక్క‌డేమైనా ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయా? అమెరికా అధ్య‌క్షుడిగా బాబు పోటీ చేస్తున్నారా? మ‌రేంటి ఈ హ‌డావుడి అని ఒళ్లు మండిన కొంద‌రు అమెరిక‌న్లు వెట‌క‌రించార‌ట‌. ఇదండి మ‌న అమెరికా అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు సంగ‌తి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}5r7o4fpfeec{/youtube}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -