Monday, May 6, 2024
- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక టికెట్‌..ఉత్కంఠ‌కు తెర‌ప‌డేదెప్పుడు….?

- Advertisement -
High tension creations in Nandyal by election

నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని పార్టీల‌కు స‌వాలుగా మారింది. అభ్య‌ర్తి విష‌యంలో అన్ని పార్టీల‌లో గంద‌గోలం నెల‌కొంది.అభ్య‌ర్తిని ప్ర‌క‌టించే విష‌యంలో అచి తూచి వ్వ‌హ‌రిస్తున్నారు. మొద‌టి నుంచి టికెట్ విష‌యంలో టీడీపీలో తీవ్ర‌పోటీ నెల‌కొంది.

టీడీపీ వైసీపీలు ఉప ఎన్నిక‌ను ప్ర‌తీస్టాత్మ‌కంగా తీసుకున్నాయి.అందుకే అభ్య‌ర్తి విష‌యంలో తొంద‌ర‌పాటు ప్ర‌ద‌ర్శించ‌డంలేదు. ఇప్ప‌టికే ప‌లానా వారికి టికెట్టు కేటాయిస్తున్నార‌ని మీడియాలో త‌ప్ప ఏపార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. దీంతో నంద్యాల రాజ‌కీయాలు గంద‌ర‌గోలంలో ఉన్నాయి. ఇక ఇరు పార్టీల శ్రేనులు అయేమ‌యంలో ఉన్నారు.
భూమా నాగిరెడ్డి హ‌ఠాత్మ‌ర‌నంలో నంద్యాల ఉపఎన్నిక అనివార్య‌మైంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియను టీడీపీ నేత చంద్రబాబు మంత్రిని చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మొదట వైకాపా నుండి పోటీ చేసి గెలిచిన తండ్రీ కూతురు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు. ఆ సమయంలో టీడీపీ నుండి బరిలోకి దిగి భూమా చేతిలో ఘోరంగా ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డి ఈ సారి ఖాళీ అయిన స్థానంలో మళ్లీ టీడీపీ నుండి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా టికెట్ రాణి ప‌క్షంలో వైకాపాలోకి వెల్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.దీంతో చంద్ర‌బాబు దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు ఉపక్ర‌మిచారు. ఇంటికి పిలుపించుకొని శిల్పామోహ‌న్‌రెడ్డితో చ‌ర్చ‌లు జ‌రిపారు.చ‌ర్చ‌లలో శిల్పావైపే మొగ్గు చూపిన‌ట్లు వార్తలు వెలువ‌డ్డాయి.
మరో వైపు భూమా అఖిల ప్రియ మాత్రం భూమా కుటుంబం నుండే నంద్యాల అభ్యర్థి ఖరారవుతారని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోపూ వ‌దులుకొనేదిలేద‌ని మొద‌టి నుంచీ చెప్తున్నారు. అయితే ఒక వైపు భూమా సెంటి మెంట్, మరో వైపు శిల్పా మోహన్ రెడ్డి హెచ్చరిక నేపథ్యంలో బాబు ఇరు వర్గాలను సంతృప్తి చెందించాలానే ప్రయత్నం లో చేస్తూనే ఉన్నారు. ఎలాగూ అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చామని, ఇక నంద్యాల సీటు మాత్రం శిల్పా మోహన్ రెడ్డికి ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబునాయుడు టికెట్ ఎవ‌రిక‌నేదాన‌కి స‌దిగ్ధంలో పెట్ట‌డంతో ఉత్కంఠ కొన‌సాగుతోంది.
మ‌రో వైపు వైసీపీ కూడా అభ్య‌ర్తి విష‌యంలో అచి తూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టీడీపీ అధికారికంగా ప్ర‌క‌టించిన త‌ర్వాత త‌మ అభ్య‌ర్తిని ప్ర‌క‌టించాల‌ని వేచి చూసె దోర‌ణిలో ఉన్నారు. శిల్లా మోహ‌న్‌రెడ్డికి టికెట్ కేటాయిస్తే అఖిల కుటంబంలో ఎవ‌రికైనా వైసీనుంచి టికెట్టు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామ‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. భూమా అఖిల‌ప్రియారెడ్డి టికెట్ విష‌యంలో కాంప్ర‌మైజ్ అయితే వైసీపీ నుంచి ధియేట‌ర్ల య‌జ‌మాని ప్ర‌తాప్‌ర‌డ్డిని బ‌రిలోకి దింపాల‌ని చూస్తున్నా. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారికంగా ప్ర‌టించ‌లేదు. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల వ‌ల్ల ఇరు పార్టీల శ్రేనులు గంద‌ర‌గోలంలో ఉన్నారు.
నంద్యాల ఉప ఎన్నిక టికెట్టు కేటాయింపు అభ్య‌ర్తి విష‌యంలో టీడీపీ,వైసీపీలు రెండూ అచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. టికెట్టు ప‌లానా వారికి ఇస్తున్నామ‌ని లీకులు త‌ప్ప అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. దీంతో టికెట్టు ఎవ‌ర‌క‌నేదానికి ప్ర‌క‌టించ‌పోవ‌డంతో నంద్యాల నియేజ‌క వ‌ర్గ‌ప్ర‌జ‌లు,నాయుకులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.మ‌రి ఇప్ప‌టికైనా ఉత్కంఠ‌కు తెర‌దించుతారా అన్నది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. స‌స్పెన్స్‌ను అలాగా కొన‌సాగిస్తూ మ‌రింత వేడిని పుట్టిస్తున్నారు. అంద‌రూ ఉత్కంఠ‌కు తెర ప‌డేదెప్పుడ‌ని ఎదురు చూస్తున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా వైసీపీ,టీడీపీ అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించి ఎంత‌మేర‌కు తెర‌దించుతారో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. భూమా చిన్న కూతురు మౌనికకు నంద్యాల వైసీపీ టికెట్
  2. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తారా…..?
  3. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం జ‌గ‌న్ వేసిన ప్లాన్ అదిరింది
  4. చంద్రబాబుకు షాక్ఇచ్చిన కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే.. 2019లో విజయం ఖాయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -