Thursday, May 16, 2024
- Advertisement -

ఉప ఎన్నికలకు ముందే.. అఖిల ప్రియకు చుక్కలు చూపిస్తున్నారు

- Advertisement -
Akhila Priya Face Problems Elections Nandhyala

ఏపీ రాష్ట్రాంలో అధికార పార్టీ లో ఉన్న సీనియర్స్ అయిన మాకు మంత్రి పదవులు ఇవ్వకుండా.. పార్టీ పునాదుల దగ్గర నుండి అన్ని వేళల అండగా ఉన్నవారికి సరైన గౌరవం దక్కడం లేదంటూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అంటున్న సంగతి తెలిసిందే.

అందరిది ఒక గోల అయితే ఇప్పుడు కొత్తగా చిన్నవయసులోనే మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కూతురు మంత్రి అయిన భూమా అఖిల ప్రియ పరిస్థితి మరోలా ఉంది. కొత్తగా మంత్రి పదవి చేజిక్కించుకున్న అఖిల ప్రియాపై పార్టీలో సీనియర్ మంత్రులు, నాయకులు తెగ కోపంగా ఉన్నారట. తాజాగా రాష్ట్రంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా మంత్రిగా బాధ్యతలు చెపట్టిన అఖిల ప్రియ అందరికంటే ముందుగా తన బాధ్యతలు నిర్వహిస్తూ పలు అభివృధ్ధి కార్యక్రమాలల్లో తన వంతు పాత్ర పోషిస్తూ నియోజక వర్గాన్ని ,జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకెళ్తోందని.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల మంత్రి అఖిల ప్రియను ఆకాశానికెత్తిన సంగతి తెలిసిందే.

అయితే ఎప్పుడు నిజం చెప్పని బాబు మాటలు నమ్మి అఖిల ప్రియ తనని ఏదో ఊహించుకొని జిల్లాకు చెందిన సీనియర్ నేతలను, మంత్రులను కూడా గౌరవించడం లేదని తెలుగు తమ్ముళ్లు తెగ హైరానా పడుతున్నారు. కర్నూలు జిల్లాలో అత్యంత సీనియర్ నాయకుడు ,డిప్యూటీ సీఎం అయిన కేఈ కృష్ణమూర్తి ను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట అఖిల ప్రియ కలవలేదు అని ఆయన తెగ భాదపడ్డాడట. ఇతనే కాకుండా జిల్లాలో ఇటివలే పర్యటించిన మరో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల రాజప్పను కూడా కలవలేదని.. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి హాజరైన కార్యక్రమానికి భూమా అఖిల ప్రియ డూమ్మా కొట్టిందట.

దాంతో పార్టీలో అత్యంత సీనియర్స్ అయిన మాకే గౌరవం ఇవ్వకుంటే కింది స్థాయి నేతలకు ఎలా గౌరవం ఇస్తుండని మంత్రి అఖిల ప్రియ పై ఫైర్ అవుతున్నారు. తన పద్దతి మార్చుకోకపోతే నంద్యాల ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని.. చంద్రబాబుకు ఈ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఫిర్యాదు చేశారట. అలానే ఇతర నేతలు కూడా అఖిల ప్రియపై నివేదికలు పంపారట. దీంతో ఏమి చేయాలో అర్ధం కాక చంద్రబాబు.. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలా గెలవాలో అర్ధం కాక తంటాలు పడుతున్నాడట.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. కృష్ణ జిల్లాలో సంచలనం.. వైసీపీలోకి ముగ్గురు కీలక నాయకులు
  2. అనుచ‌రుల ఒత్తిడితో ఎటూతేల్చుకోలేక పోతున్న భూమాఅఖిల ప్రియారెడ్డి
  3. ఎన్నికలకు… సీతాదేవికి లింకేంది బాబు…!
  4. ద‌మ్ముంటే కాసుకోండి.. ఢిల్లీమాదే ..అమీత్‌షాకు మ‌మ‌త‌స‌వాల్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -