Sunday, June 2, 2024
- Advertisement -

రెండు వేర్వేరు చోట్ల రూ..82 కోట్ల విలువైన పాముల విషం స్వాధీనం

- Advertisement -
Snake Venom caught in West bengal

పాముల విషాన్ని వైద్యంలో ఉప‌యేగిస్తుండ‌టంతో దాని అక్ర‌మ ర‌వాణా తారాస్థాయికి చేరింది.మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ‌గా ఉండ‌టంతో స్మ‌గ్ల‌ర్లు పాముల విషాన్ని దొంగ‌గా ర‌వాణా చేస్తున్నారు.

పాము విషంతో వ్యాపారం కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యవహారం కావడం అంత కన్నా విచిత్రం. బెంగాల్ లో పాము విషం స్మగ్లింగ్ సంచలన స్థాయికి చేరింది. తాజాగా పోలీసుల తనిఖీల్లో అత్యంత భారీ స్థాయి ముఠాలు పట్టుపడ్డాయి. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా రూ.82 కోట్ల విలువైన పాము విషాన్ని పోలీసులు స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

డార్జిలింగ్ ప్రాంతంలో స్మగ్లర్ల నుంచి రూ.70 కోట్ల రూపాయల విలువైన పాము విషాన్ని పట్టుకున్నట్టుగా భద్రతా సిబ్బంది తెలిపింది. అన్ని కోట్ల రూపాయల విలువ గల విషం కూడా కేవలం రెండు జాడీల పరిమాణంలోనే ఉంది. పాము విషం ఖరీదు చాలా ఎక్కువ అని.. కొన్ని రకాల మందుల, బ్యూటీ ప్రోడక్ట్ల తయారీకి దీన్ని వాడతారని.. ఔన్స్ పరిమాణం విషం విలువే లక్షల రూపాయలని తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం రెండు జాడీల్లోని విషం విలువ రూ.70 కోట్ల వరకూ ఉంటుందని నిర్ధారించారు.
ఇక డార్జిలింగ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోనే మరోచోట రూ.12 కోట్ల విలువైన విషాన్ని స్మగర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.గంగారాంపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఫుల్బరీ-ప్రాణసాగర్ ప్రాంతంలో అటవీ అధికారులతో కలిసి ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్‌ నిర్వహించిన దాడుల్లో రెండు జాడీల్లో దాచిన పాము విషాన్ని కనుగొన్నారు. నిందితుడొకరిని అరెస్ట్‌ చేశారు.

{loadmodule mod_custom,Side Ad 2}

పాము విషానికి అంత‌ర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది.దీన్ని ఔషధాలు, సౌందర్య సాధనాలు తయారు చేయడానికి ఉపయోగించే పాము విషానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఒక్క గ్రాము విలువ లక్ష రూపాయలు పైగా ఉంటుందని అంచనా. ప్రపంచంలో ఏ దేశంలో జరగనంతగా ఒక్క భారత దేశంలోనే పాము విషం స్మగ్లింగ్‌ ఎక్కువగా జరుగుతోంది.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌ పాము విషం అక్రమ రవాణా చాలా ఎక్కువ. పాము విషం స్మగ్లింగ్‌ చేస్తూ నిందితులు పట్టుబడడం బెంగాల్‌లో సాధారణంగా మారింది. ప్రతియేటా పాము విషం స్మగ్లింగ్ భారత్ తొలి స్థానంలో నిలుస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -