Tuesday, April 30, 2024
- Advertisement -

ముకుల్​ ఉంటారా? పోతారా? బెంగాల్​ బీజేపీలో టెన్షన్​..!

- Advertisement -

పశ్చిమ బెంగాల్​ బీజేపీ నేతలు ఇప్పుడు టెన్షన్​ టెన్షన్​గా గడుపుతున్నారు. అందుకు కారణం అక్కడ దీదీ మళ్లీ అధికారంలోకి రావడమే. ఈ సారి మమతా అధికారం చేపట్టకుండా చేస్తామని బీజేపీ భావించింది. ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేసింది. టీఎంసీకి చెందిన కీలక నేతలను సైతం తమ వైపుకు తిప్పుకొన్నది.

దీదీని మట్టి కరిపించేందుకు ఎన్నో ఉపాయలు పన్నింది. వ్యూహాలు రచించింది. ఓ దశలో బీజేపీ పై చేయి సాధించినట్టు కూడా కనిపించింది. కానీ ఫలితం బీజేపీ ఆశించనట్టు రాలేదు. బీజేపీ వ్యూహాలను ఎంతో తెలివిగా తిప్పికొట్టిన దీదీ తిరిగి అధికారంలోకి వచ్చింది. సీఎం పీఠం మీద కూర్చున్నది. అయితే అప్పటి నుంచి టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన నేతలకు భయం పట్టుకున్నది. ఎప్పుడు ఏకేసు పెడతారా? అని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు ద్వితీయ శ్రేణి నేతలు సైతం బీజేపీని వీడి సొంతగూటికి చేరిపోయారు. చాలా మంది ఎమ్మెల్యేలు సైతం టీఎంసీ lలో చేరబోతున్నారని వార్తలు వచ్చాయి.

Also Read: ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్​పై క్యాడర్​ నిరుత్సాహం

ఇదిలా ఉంటే టీఎంసీ నుంచి బీజేపీలో చేరి కీలక నేతగా ఎదిగిన ముకుల్​ రాయ్​.. తిరిగి సొంతగూటికి చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ రాలేదు కానీ.. ముకుల్​ రాయ్​ చర్యలు గమనించిన వారికి మాత్రం ఇటువంటి అనుమానాలు వస్తున్నాయి.

ఎందుకంటే ఆయన కొంతకాలంగా బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా బెంగాల్ బీజేపీ ఓ కీలక సమావేశాన్ని నిర్వహించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ కి చెందిన ముఖ్యనేతలు మాత్రమే ఈ మీటింగ్​కు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ముకుల్​ రాయ్​ హాజరు కాలేదు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి.

మరోవైపు తృణమూల్ ఎంపీ, మమతా అల్లుడు అభిషేక్ బెనర్జీ ఇటీవల ముకుల్​ రాయ్​ భార్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ముకుల్​ రాయ్​ను టీఎంసీలో చేరాలంటూ ఆహ్వానించారని టాక్​. అప్పటి నుంచి ముకుల్​ బీజేపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన బీజేపీలో ఉంటారా? లేక టీఎంసీలో చేరిపోతారా? అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Also Read: లోకేశ్​ నిన్ను హెరిటేజ్​ దున్నపోతు అనాలా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -