ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు షాకులమీ షాకులు ఇస్తున్నారు. స్వచ్ఛభారత్‌మీద ట్యాక్స్.. పెద్ద నోట్ల రద్దు…నోట్లమార్పిడి…ప్రతీ దానికి ఆధార్ లింక్ … ప్రతీరోజూ మారె పెట్రోల్ ధరలు …అన్నీ ఇన్నీకావు ఇటీవల కాలంలో దశంలో సామాన్యులు తిన్నషాకులు . మరి ఇప్పుడు ప్రజలకు మరో షాక్ ఇచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. ఈసారి ఏంటో తెలుసా? మనం బయట హోటళ్లు, రెస్టారెంట్‌లలో తినేతిండిన కంట్రోల్ చేయడానికంట.
మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లలో రోజూ కొన్ని కోట్ల రూపాయల విలువైన ఆహారం వృథా అవుతోంది కొత్త విషయం కాదు. ఈవృధా పుడ్ లెక్కల ప్రకారం చూస్తే కేవలం 2013-15 సంవత్సరాల నడుమ కాలంలోనే ఏకంగా రూ.92వేల కోట్ల విలువైన ఆహారం వృథా అయిందట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, మన దేశంలో ఫుడ్‌ను ఎంత వృథా చేస్తున్నారో. ఓ వైపు పేదలు ఒక్క పూట కూడా తినడానికి సరైన తిండికి నోచుకోవడం లేదు. మరో వైపేమో ఇలా పెద్ద ఎత్తున ఆహారం వృథా అవుతోంది. ఈ క్రమంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే అలా వృథా అయ్యే ఆహారాన్ని సేకరించి అవసరం ఉన్న పేదలకు పంచి పెడుతున్నా ఇంకా ఎంతో కొంత ఆహారం వృథానే అవుతోందట.
ఈవృథాను అరికట్టేదానికి కేంద్రం ఒ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. బయట హోటల్స్, రెస్టారెంట్లలో ఎంత పడితే అంత తింటాం, మిగిలింది వేస్ట్ చేస్తాం ఇక అలా అంటే కుదరదట. అలా వేస్ట్ చేస్తే సదరు హోటల్ లేదా రెస్టారెంట్‌కు ఫైన్ వేస్తారట. మర వాల్లు ఊరుకుంటారా అది పరోక్షంగా వాటికి వెళ్లే భోజన ప్రియులపైనే పడుతుంది. అంటే మనపైనేగా. దీంతో ఆహారం వృథా తగ్గించవచ్చని ప్రభుత్వం ప్లాన్. మరి ఈ ప్లాన్‌ను ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలియదు. కానీ… కచ్చితంగా అమలులోకి తెచ్చే యోచనలోనే ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. అయితే ప్లాన్ మంచిదే అయినా… హోటల్స్, రెస్టారెంట్లు చెప్పినట్టు నడుచుకుంటాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎక్కడ చూసినా ఎంఆర్‌పీ రేట్ల కన్నా ఎక్కువ చార్జిలు వేసి, వినియోగదారుల ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి… ఆ క్రమంలో ఇక ఇలాంటి స్కీమ్ వస్తే వారి దోపిడీకి అడ్డూ అదుపూ ఉండదు. అలా గనక జరిగితే ఈ ప్లాన్ కూడా ప్రజలకు మరో పెద్ద షాక్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. కేంద్రం దీనిపై ఎలాంటి చర్యతీసుకుంటుందో చూద్దాం
Related