Wednesday, May 15, 2024
- Advertisement -

రాజ‌కీయాల్లో కేసీఆర్ ఈ రిజ‌ర్వేష‌న్ల స్పూర్తి అమ‌లు చేస్తాడా?

- Advertisement -
reservation about kcr

రిజర్వేషన్ల రాజ‌కీయ  తేనెతుట్టెను కదిలించడం ద్వారా  కేసీఆర్ ఆశించిన‌ ప్రయోజనాలు ఏమిటి..?   జనాభాలో అధిక సంఖ్యలో ఉన్న వర్గాలను ఓటు బ్యాంకు చేసుకోవడమే… ఇది ఇప్పుడు నుంచి కాదు అనాదిగా వ‌స్తున్నది. మ‌ళ్లీ అధికారంలోకి  రావ‌డానికి  ఓటు బ్యాంక్ రాజ‌కీయాలు  అన‌డంల సందేహంలేదు. అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వాలు త‌న స్వార్థ రాజ‌కీయ ప్ర‌యేజ‌నాల‌కోసం రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ఒక ఆయుధంగా ఉప‌యేగించ‌డం అంద‌రికీ తెలిసిందే.

పైకి ఎన్ని క‌ల్లిబొల్లిమాట‌లు చెప్పుకున్నా అది అంతిమంగా  ఏం  చెప్ప‌ద‌లుచుకున్నా  కేవలం రాజకీయ ప్రయోజనమే దాని లక్ష్యం… సమాజానికి దూరదృష్టితో చూడటం వేరు, తమ ప్రయోజనాల కోసం సమాజాన్ని మరింత సంకుచితం చేయడం వేరు… కేసీయార్‌కు ఇవన్నీ తెలియనవి కావు… తనకు రిజర్వేషన్ల అసలు స్ఫూర్తి ఏమిటో తెలియదా..? ఒకరికి న్యాయం పేరిట ఇంకొకరికి అన్యాయం కరెక్టు కాదని తెలియదా..? రిజర్వేషన్లు పొందినవారే పదే పదే దాని లబ్ధి అనుభవిస్తున్నారనే భావనతో అమల్లోకి వచ్చిన క్రీమీలేయర్ ఏమిటో తనకు తెలియదా..? అన్నీ తెలుసు… కానీ తనకు ఇప్పుడు కేవలం తన రాజకీయ లక్ష్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి… ఆయన ప్రధానంగా  ఇప్పుడు రెండు అంశాలను చర్చకు పెట్టాడు… రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం రాష్ట్రాలకు వదిలేయాలిని డిమాండ్ చేస్తున్నారు.. అలాగే వ‌దిలేస్తే…. అధికారంలోకి ఎవ‌రు వ‌చ్చినా ఎవారి ప్ర‌యేజ‌నాల‌కోసం  ,రాజ‌కీయ ల‌బ్ధికోసం  ఇష్టాసారంగా రిజ‌ర్వేష‌ణ్లు ఇచ్చుకుంటూ పోతే  సామాజిక అశాంతికి కారణమైతే ఎవరు బాధ్యులు..? ఈ స్వార్థ రాజకీయ ఎత్తుగడలతో సమాజంలో జాతుల ఘర్షణ జరిగితే ఎవరు జవాబుదారీ..? కేంద్రానికి ఏ బాధ్యతా లేదా..? రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఇంకా  రిజర్వేషన్ల చిచ్చు రగిలిస్తూ పోతే…  కేంద్రం ఎందుకు జోక‌యం చేసుకోవ‌డంలేదు.  

అసలు కేంద్రమంటే అదేదో మనకు సంబంధం లేనట్టు ప్రచారం చేయడం ఏమిటి..? కేంద్రమంటే మనమే… మనం ఓట్లు వేశాం… మనం ఏర్పాటు చేసుకున్న కేంద్రమే… కేంద్రం బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది… సురక్షితంగా ఉంటుంది… కేంద్రాన్ని ఏదో శత్రువుగా చూపడమే అసమంజసం… ఇక జనాభా దామాషా ప్ర‌కారం  ఇవ్వాల‌నీ  వివిధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో బీసీలు తమ రిజర్వేషన్లు పోనూ మిగతా 50 శాతం ఓపెన్ కోటానూ పోటీపడేవాళ్లు… కానీ ఇప్పుడు వాళ్లు 69 శాతం పోనూ మిగిలిన 31 శాతంలోనే ఓపెన్ పోటీపడాలి… అంటే బీసీలకు జరుగుతున్నది నష్టమా..? లాభమా..?  ఇక మిగిలిన వ‌ర్గాలు  50 శాతంలోనే పోటీపడుతున్నాయి… ఇప్పుడిక ఏ 30 శాతంలోనో పోటీపడుతూ, అది సామాజిక అశాంతికి దారితీస్తే  ప‌రిస్తితులేంటి. రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాలంటే అధికారంలో ఉన్న పాల‌కులు క‌మిష‌న్లను వేయ‌డం అన‌వాయితీ.  కమిషన్లు రిపోర్టులు ఇస్తాయి… కేసీయార్ ముస్లిములకు భారీగా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఆ కమిషన్‌కు  మైనారిటీల వెనుక‌బాటు క‌నిపిస్తుంది…అకస్మాత్తుగా ఎంబీసీలు గుర్తొస్తారు… అదే బీజేపీని ఓ కమిషన్ వేయమనండి… అది ఏమని రిపోర్టు ఇస్తుందో చూడండి.

నిజానికి పేదరికానికి కులముందా..? ఇప్పుడు అన్ని కులాల్లోనూ పేదరికం ఉంది. స‌మాజంనుంచి మ‌రికొంద‌రిని విడ‌దీసే పాపం ఎందుకు. సామాజిక వెనకబాటుతనం పోవ‌లంటే  నాలుగు కాలేజీల్లో సీట్లు, నాలుగు కొలువులు దొరికితే చాలా… సామాజికంగా ముందుకొచ్చేస్తారా..?    ఇక వెనుక‌బ‌డిన వ‌ర్గాలు  సమాజంలో అందరితోనూ సమానమే అని తలెత్తుకుని బతకాలంటే వాళ్లకు రాజ్యాధికారం కావాలి… మంచి మంచి పదవుల్లో వాళ్లకు అవకాశాలు కావాలి… అదీ సామాజిక హోదా… అదీ సామాజిక వెనకబాటుతనాన్ని పోగొట్టే మార్గం… కానీ జరుగుతున్నదేమిటి..? మంత్రి పదవుల్లో వాటా ఎంత..? రిజర్వేషన్ల శాతం ప్ర‌కారంబ‌డి మంత్రి ప‌ద‌వులు ఇస్తున్నారా. ఇదే 69 శాతం రిజర్వేషన్ల స్ఫూర్తిని కేబినెట్‌లో చూపిస్తారా. మొత్తం అసెంబ్లీ సీట్లలో, మండలి సీట్లలో పార్లమెంటు సీట్లలో ఇదే 69 శాతం రిజర్వేషన్ల స్ఫూర్తిని అమలు చేయగలరా. ఇప్పటికీ అడవుల్లో, మారుమూల గ్రామాల్లో వైద్యానికీ, విద్యకు, రక్షణకు, కనీస సౌకర్యాలకు నోచుకోని బిడ్డల్లో అసలు చదువు శాతమెంత..? చ‌దువును మానేసిన‌వారు ఎంత‌మంది. అస‌లు  ప్రసూతి మరణాలు, శిశుమరణాల రేటెంత..? మామూలు జ్వరాలకూ రాలిపోతున్న ప్రాణాల సంఖ్య ఎంత మంది వీట‌న్నింటినీ అలోచించ‌కుండా  ఇష్టాసారం రిజ‌ర్వేష‌న్లు ఏంటి.… ఇవీ మన రాజకీయాలు…!!

Related

  1. ఇర‌కాటంలో జ‌న‌సేన‌…. పవన్ చూపుఎటూ
  2. మ‌రో అణు యుధ్దం తప్ప‌దా… అమెరికాకు ర‌ష్యా,ఇరాన్ వార్నింగ్‌…..
  3. చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌ద‌రంగంలో అఖిల ప్రియ పావేనా?
  4. టీడీపీలోకి మాజీ సీఎం ఫ్యామిలీ.. సూపర్ ఆఫర్ ఇచ్చిన బాబు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -