Monday, May 20, 2024
- Advertisement -

చంద్రబాబు ని లెక్క చెయ్యని రేవంత్ రెడ్డి ! రెండు వర్గాలు గా చీలిపోయిన పార్టీ ?

- Advertisement -

తెలుగు దేశం పార్టీ తెలంగాణా లో దదాపు ఖాళీ అయిపొయింది. ఎంతసేపూ హడావిడి చేసి కెసిఆర్ మీద బేల అరుపులు అరిచే రేవంత్ రెడ్డి తప్ప ఆ పార్టీ లో కనీసం జనలాకి తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ బిగాలలేదు. అయితే నెత్తిమీద మరొక పిడుగు లాగా తెలంగాణా టీడీపీ నాయకులు చంద్రబాబు కి కొత్త ఇబ్బంది సృష్టిస్తున్నారు. రేవంత్ రెడ్డి దయవలన తెలంగాణా టీడీపీ లో అంతర్గత విభేదాలు తలెత్తాయి అనీ టీటీడీపీ రెండు వర్గాలుగా చీలిపోతోంది అనీ చెబుతున్నారు.

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం చేసిన నలభై ఎనమిది గంటల దీక్ష తరవాత ఈ వివాదం చంద్రబాబు వరకూ వెళ్ళింది. రేవంత్ రెడ్డి – పార్టీ తెలంగాణా అధ్యక్షుడు రమణ ల మధ్యన టీటీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది అంటున్నారు. మల్లన్న ప్రాజెక్ట్ విషయం లో రేవంత్ టీడీపీ నాయకులని కలుపుకుని పోకుండా ఒక్కడే హడావిడి చేస్తున్నాడు అనేది తెలంగాణా నేతల ఆరోపణ. అయితే అందరికీ చెప్పే చేసాం అంటున్నారు రేవంత్ వర్గం వారు.

అసలు చంద్రబాబు ని సైతం లెక్క చెయ్యకుండా ఈ దీక్ష మొదలు పెట్టాడు అని మరికొందరు అంటున్నారు. రెండురోజుల పాటు సాగిన దీక్షకు హైదరాబాద్ నుంచే ర్యాలీగా పార్టీ నాయకులు – కార్యకర్తలు వెళ్లారు. ఆ పార్టీ అన్ని జిల్లాల అధ్యక్షులూ హాజరయ్యారు. అదే తరుణంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు – ఇతర పొలిట్ బ్యూరో సభ్యులు – సీనియర్ నాయకులు వెళ్లలేదు. మద్దతివ్వలేదు. ఇది దీక్ష నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా మరోసారి అభిప్రాయబేదాలను బట్టబయలు చేసిందని అంటున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నవారు ఉండగా బాగా జరిగిందంటూ దీక్ష చేసిన రేవంత్ ను అభినందిస్తున్న వారూ లేకపోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -