ప్రభాస్ కు టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాలో నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇతర దేశంలో కూడా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. బాహుబలి సినిమా తర్వాత సాహోలో నటించిన ప్రభాస్. ఈ సినిమా అనుకున్నంతగా ఆడలేదు.
అందుకే ఇప్పుడు మరో సూపర్ హిట్ కొట్టాలని రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ఫారెన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హేగ్డే నటిస్తోంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత హిందీలో నటించనున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ కి ఇష్టమైన హీరోలు ఎవరన్న విషయం చాలా మందికి తెలియదు.
ప్రభాస్ కు రాబర్ట్ డే నీరో, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ అంటే చాలా ఇష్టమట. తెలుగులో అయితే కృష్ణంరాజు, చిరంజీవి అంటే ప్రభాస్ ఎక్కువగా ఇష్టపడుతాడట. ప్రభాస్ కు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమట. తమ ఇంట్లో ప్రతి రోజు నాన్ వెజ్ స్పెషల్ ఉంటుందట. చాపల పులుసు, బిర్యాని అంటే ప్రభాస్ ఎక్కువ ఇష్టంగా తింటాడట.
పూరీ తో ఆ రీమేక్ సినిమా పవన్ కళ్యాణ్ చేసేనా..?
కాజల్ అగర్వాల్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?