Tuesday, April 16, 2024
- Advertisement -

హరీష్ రావు రెండు కళ్ళ సిద్ధాంతం వర్క్ అవుట్ అయ్యేలా ఉందే..?

- Advertisement -

తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగిన టి.ఆర్.ఎస్ పార్టీ కి గతంలో ఎప్పుడు లేనంతగా వ్యక్తిరేకత గత కొద్దీ కాలంగా ఉందని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి.. అయితే అధికార పార్టీ మాత్రం దీన్ని కొట్టి పారేస్తోంది.. తెలంగాణాలో గులాబీ పార్టీ ప్రజలకు ఎప్పుడు విధేయతగా ఉంటుంది అందుకే ప్రజలు పార్టీ ను గెలిపిస్తూ వస్తున్నారు అని చెప్తున్నారు..ఈ క్రమంలో ఇప్పుడు వస్తున్న దుబ్బాక  ఉప ఎన్నికలో గులాబీ దండు విజయం సాధించడం ఖాయమనై చెప్తున్నారు.. వాస్తవానికి ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ కి గతంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది.. ఎప్పుడు ఓడిపోకపోగా భారీ మెజారిటీ తో విజయం సాధించింది. దుబ్బాక లో కూడా అదే చరిత్ర రిపీట్ అవుతుందని గులాబీ నేతలు అభిప్రాపపడుతున్నారు..

నవంబర్ మూడో తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నికల్లో గెలిచే బాధ్యత ను కేసీఆర్ హరీష్ రావు కి అప్పగించగా నోటిడికేషన్ రాకముందు నుంచే హరీష్ రావు ఈ నియోజకవర్గంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.. తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలా అయన చెమటోడ్చుతున్నారు.. అయితే హరీష్ రావు ఇక్కడ ఇంతలా కష్టపడిపోవడానికి కారణం లేకపోలేదు.. గత ఆరేళ్లుగా పార్టీ మంచి పరిపాలన కొనసాగిస్తూ ఉండగా, ఇటీవలే కాలంలో వచ్చిన విమర్శలు ఎప్పుడు రాలేదు.. ఇలాంటి టైం లో గెలిచి పార్టీ సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

ఈ నేపథ్యంలో హరీష్ రావు ఇక్కడ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు.. దుబ్బాకలో.. గత ఆరేళ్లుగా ఎలాంటి పనులు జరగలేదన్న అసంతృప్తి అక్కడి ప్రజల్లో ఉంది. దీన్ని తగ్గించడానికే.. తానొచ్చానన్న అభిప్రాయాన్ని కల్పించడానికి హరీష్ ప్రయత్నిస్తున్నారు.టీఆర్ఎస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకుని టిక్కెట్ ఇచ్చింది. నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరులు ఉన్న శ్రీనివాస్ రెడ్డిని హరీష్ తక్కువగా అంచనా వేయడం లేదు. కాంగ్రెస్‌లో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి వ్యతిరేకుల్ని పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది నేతలకు కండువాలు కప్పారు. ఇతర నేతలపైనా గురి పెట్టారు.

కేసిఆర్ దుబ్బాక లో ఈ రేంజ్ లో ప్లాన్ చేశారా..?

బండి సంజయ్ తెలంగాణాలో సక్సెస్ అయినట్లేనా..?

తెలంగాణాలో హల్చల్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..?

కోదండ రాం ఒంటరిగా వేల్లాల్సిందేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -