జ‌గ‌న్‌ను అడ్డంగా పట్టుకున్న ఏఎన్నార్‌

jagan caught redhanded to anr

ఏపీలో వైఎస్‌.జ‌గ‌న్ కు ఏ రెంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే ఇక్కడ జగన్ కి… లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు సంబంధం ఏంటి? అసలు అక్కినేని నాగేశ్వరరావు.. జగన్ ను అంత రెడ్ హ్యాండెడ్ గా ఎలా పట్టుకున్నారు..? అసలు ఏంటి అ విషయం ఇప్పుడూ చూద్దాం.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియని సీక్రెట్ ఏంటంటే.. సినీ నటుడు సుమంత్, వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని.

వీరిద్దరు చిన్నప్పుడు ఓకే క్లాస్ లో.. ఒకే బెంచ్ లో కూర్చుని చదువుకున్నారు. వీరిద్ద‌రూ క‌లిసి చేసిన అల్ల‌రికి అంతే ఉండేది కాద‌ట‌. బయట పొద్దుపోయేవరకు కలిసి తిరిగేవారట. ఓ రోజు చాలా లేట్‌గా సుమంత్ – జ‌గ‌న్ క‌లిసి ఇంటికి వ‌చ్చార‌ట‌. ఆ రోజు లేట్ అవ్వ‌డంతో జ‌గ‌న్ కూడా సుమంత్ ఇంట్లోనే ఉండిపోయాడ‌ట‌.

ఆ రోజు వీరు అర్ధ‌రాత్రి దాటాక దొంగచాటుగా పైకి ఎక్కుతూ అక్కినేని నాగేశ్వరరావుకి దొరికిపోయారట. కింద నుంచి పైనున్న సుమంత్‌ బెడ్రూమ్‌కు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నార‌ట‌. ముందుగా సుమంత్ గ్రిల్‌ పట్టుకుని పైకి ఎక్కుతుండ‌గా…. జగన్‌ కింద ఉండ‌గా..వెంట‌నే ఏఎన్నార్ అక్క‌డ‌కు రావ‌డంతో వీరిద్ద‌రు అడ్డంగా ఆయ‌న‌కు దొరికేశారు. ఈ విష‌యాన్ని సుమంత్ టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్‌గా చేసే ఓ కార్యక్రమంలో వెల్లడించాడు.

{youtube}yvN2-ZcMxlE{/youtube}

Related

  1. పవన్ వాడ్ని చంపేద్దామనుకున్నాడట!
  2. జబర్దస్త్ షోకి చెక్ పెట్టేందుకు ప్లాన్?
  3. పవన్ కళ్యాణ్ కి షాక్ ఇచ్చిన నయనతార!
  4. కమెడియన్స్ మధ్య బిగ్ వార్!