Friday, March 29, 2024
- Advertisement -

కమెడియన్స్ మధ్య బిగ్ వార్!

- Advertisement -
Srinivas Reddy And Allari Naresh movies Clash

టాలీవుడ్ ఈ నవంబర్ నెల కాస్త నెమమ్మదిగా నడుస్తోంది. ఈ నెల చైతు సినిమా సాహసం శ్వాసగా సాగిపో సినిమా పర్వలేదు అనిపించిన… ఇప్పుడు వరస సినిమాలు రాబోతున్నాయి. వీటిలో అల్లరి నరేష్ మూవీ “ఇంట్లో దెయ్యం.. నాకేం భయం”.. శ్రీనివాస రెడ్డి నటిస్తున్న “జయమ్ము నిశ్చయమ్మురా”.. సప్తగిరి యాక్ట్ చేసిన “సప్తగిరి ఎక్స్ ప్రెస్”లు ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటిలో జయమ్ము నిశ్చయమ్మురా.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ లు ఒకే రోజున విడుదల కానున్నాయి.

ఓ వారం గ్యాప్ లో రావాలి కానీ.. ఇప్పుడు ఒకే డేట్ కి సెట్ అయ్యాయి. ఇద్దరూ కమెడియన్ నుంచి హీరోగా అప్ గ్రేడ్ అయేందుకు ట్రై చేస్తున్న వారే కావడం ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం. శ్రీనివాస రెడ్డి మూవీకి ముందే నుంచే బజ్ ఉండడం పాజిటివ్ అంశమైతే.. సప్తగిరి సినిమా ఆడియోకి పవన్ కళ్యాణ్ రావడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది. మరి ఈ వీరిద్దరిలో ఎవరి సినిమా ఎంత ఫేర్ చేస్తుందనే సంగతి ఆసక్తికరం. రెండు చిన్న చిత్రాల్.. కంటెంట్ బానే ఉంటే.. ఒకే రోజు వచ్చేసినా సేఫ్ జోన్ లోకి వచ్చేయడం పెద్ద కష్టమేమీ కాదు.

మరి ఇద్దరు కమెడియన్స్ హీరోలుగా మారడం బాగానే ఉంది కానీ.. మరి హీరోగానే కెరీర్ కంటిన్యూ చేస్తామంటారా.. లేక కమెడియన్ వేషాలు వేసుకుంటూ అడపాదడపా మెరిపిస్తారా అనేదే ఆసక్తి కలిగించే విషయం. శ్రీనివాసరెడ్డి వరకూ రెండు పడవలనూ నడిపించేయడం గీతాంజలి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇది కూడా హిట్ అయ్యాక.. మరి శ్రీనివాస రెడ్డి ఏం చేస్తాడో.. హిట్ సాధించేశాక.. సునీల్ లాగా నేను కూడా హీరోనే అని అంటారో చూడాలి.

Related

  1. అనుష్క పెళ్లి ఇండస్ట్రీ వ్యక్తితో కాదు..!
  2. రామ్ గోపాల్ వర్మని బెదిరించిల అఖిల్?
  3. శర్వానంద్ రామ్ చరణ్ తోడల్లుడు కాబోతున్నాడు?
  4. పైట జారితే ఊరుకునేది లేదు- యాంకర్ శ్యామల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -