తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సంచలనం సృష్టించిన షో ‘జబర్ధస్త్’. జబర్దస్త్ షో కాసుల వర్షం కురిపించడంతో పాటు ఎంతో మంది నటులకు జీవనోపాధిని కల్పింస్తుంది. శకలక శంకర్, ధన్ రాజ్, వేణు, చమ్మక్ చంద్ర, శేషు, సుధీర్ లాంటి వారు జబర్దస్త్ షోతో పాపులారిటీ సంపాదించుకుని సినిమాల్లో కమెడియన్లుగా నటిస్తున్నారు. ఇక జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ల విషయానికి వస్తే వీళ్లు టెలివిజన్ చరిత్రలో ట్రెండ్ సెట్టర్స్ అనే చెప్పాలి.
అనసూయ, రష్మీలు తమ రాకతో యాంకర్ అంటే ఇలాగే ఉండాలి అన్న గీతను చెరిపేశారు. యాంకరింగ్‌తో ఎక్స్‌ట్రాయాక్టివిటీస్‌తో యూత్‌కి గాలం వేశారు. ఇక మెదటనుండి ఈ ప్రోగ్రామ్‌కి జడ్జీలుగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు,రోజా లు కూడా బాగానే పాపులర్ అయ్యారు. అయితే రేటింగ్స్‌లో దూసుకుపోతున్న జబర్తస్త్ కామెడీ షోకి బ్రేకులు పడేలా కనిపిస్తున్నాయి.
తాజాగా ఈ కామెడీషోకి పోటీగా మరో ఎంటర్ టైన్మెంట్ చానల్ వారు ఇలాంటి కార్యక్రమానికే ప్లాన్ చేసి జబర్దస్త్ షోకి చెక్ పెట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేశారట. అంతేకాదు తొందరలోనే ఈ కార్యక్రమం ప్రసారం చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారట. జబర్దస్త్ షోలో వచ్చే బూతు పురాణాల వంటివి కాకుండా భిన్నంగా ఆలోచిస్తున్నారట. అందుకోసం జడ్జీలను సైతం ముందుగానే బుక్ చేసుకున్నారట. పోసాని , రమ్యకృష్ణలు ఈ కామెడీషోకి జడ్జీలుగా రావచ్చొనే వార్తలు వస్తున్నాయి.
Related
