తెలంగాణలో 14 నుంచి 23వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థుల సర్టిఫి కెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మం డలి పేరుతో నోటిఫికేన్ జారీ చేశారు.
ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ కో కన్వీనర్ సాంకేతిక విద్యా కమిషనర్ శైలజారామయ్యర్ నోటిఫికేషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలిం గ్‌ను ఆగస్టు 31లోగా ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ప్రతి రోజు 25 వేల మంది విద్యార్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచినట్లు తెలిపారు. మాసాబ్‌ట్యాంక్‌లో ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు 14వ తేదీ నుంచ 18వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.