Tuesday, April 30, 2024
- Advertisement -

ఏపీ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల చేసిన ఉన్న‌త విద్యామండ‌లి..

- Advertisement -

ఏపీ ఎంసెట్-2019 ఫలితాలను ఉన్న‌త‌విద్యామండ‌లి ఛైర్మెన్ విజయరాజు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఉద‌యం 11.30 గంటలకు విడుద‌ల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను అధికారులు కేటాయించారు. మొత్తం 2,82,901 మంది విద్యార్థులు ఎంసెట్‌ పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌ పరీక్షకు 1,85,711 మంది హాజరు కాగా.. వ్యవసాయ, వైద్య విద్య పరీక్షకు 81,916 మంది హాజరయ్యారు. ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు ఏప్రిల్ 20 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ నుంచి దాదాపు 36,698 మంది విద్యార్థులు ఏపీ ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యారు .

విద్యార్థుల మొబైల్‌ నంబర్లకే ర్యాంకులను ఎస్‌ఎంఎస్‌గా పంపించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో పినిశెటి రవితేజ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించగా, వేద ప్రణవ్‌కు సెకండ్‌ ర్యాంక్‌ వచ్చింది. ఇంజినీరింగ్‌లో మొత్తం 74.39 శాతం ఉత్తీర్ణత న‌మోదుకాగా మెడికల్‌ విభాగంలో వెంకటసాయి స్వాతి ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. ఈ నెల 10 నుంచి ర్యాంక్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

ఇంజనీరింగ్‌లో టాప్ టెన్ ర్యాంకర్లు:

  1. పినిశెట్టి రవిశ్రీ తేజ
  2. పి. వేద ప్రణవ్
  3. భానుదత్త
  4. డి.చంద్రశేఖర్
  5. బట్టెపాటి కార్తికేయ
  6. రిషి
  7. జి. వెంకట కృష్ణ
  8. అభిజిత్ రెడ్డి
  9. ఆర్యన్ లద్దా
  10. హేమ వెంకట అభినవ్

మెడికల్‌లో టాప్‌ టెన్ ర్యాంకులు:

  1. సాయిస్వాతి
  2. దాసరి కిరణ్ కుమార్ రెడ్డి
  3. సాయి ప్రవీణ్ గుప్తా
  4. హాషిత
  5. మాధురి రెడ్డి
  6. కృష్ణ వంశీ
  7. కంచి జయశ్రీ వైష్ణవి వర్మ
  8. సుభిక్ష
  9. హరిప్రసాద్
  10. ఎంపటి కుశ్వంత్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -