Tuesday, May 21, 2024
- Advertisement -

పేద విద్యార్థుల కోసం తెలంగాణ ఆద‌ర్శ నిర్ణ‌యం

- Advertisement -
పేద విద్యార్థులు ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వ‌డ‌మే క‌ష్టం. అలాంటి ఇంజినీరింగ్‌, వైద్య విద్య‌ను చ‌ద‌వ‌డం ఇక గ‌గ‌న‌మే. ప‌దో త‌ర‌గ‌తి త‌ర్వాత ఇంట్లో కూర్చొబెడుతున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. మ‌రీ వాటికి అడ్డుక‌ట్ట వేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఓ మంచి నిర్ణ‌యం తీసుకుంది. ఉన్న‌త వ‌ర్గాల‌కే ద‌క్కే ఎంసెట్‌, నీట్ ప‌రీక్ష‌ల్లో పేద విద్యార్థులు కూడా రాణించాల‌నే ఉద్దేశంతో విద్యార్థుల‌కు ఉచిత శిక్ష‌ణ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.
ఎంసెట్, నీట్ పరీక్షల కోసం తెలంగాణ ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు ఉచిత శిక్ష‌ణ ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. పోటీ ప‌రీక్ష‌ల‌కు రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూల్స్, ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా త‌ర‌గ‌తులులు చెప్పిస్తున్నట్లు ఉప ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్ర‌క‌టించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,500 మంది విద్యార్థులకు 26 కేంద్రాల్లో నీట్‌, ఎంసెట్ ప‌రీక్ష‌ల‌కు ఉచిత శిక్ష‌ణ ఇస్తున్న‌టు్ల తెలిపారు.
ప్రతి సెంటర్‌కు ఒక ప్రిన్సిపాల్‌ను నియమించి కొన‌సాగిస్తున్న శిబిరాల్లో రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్ విద్యార్థులు మంచి ఫలితాలు క‌న‌బ‌రుస్తున్నార‌ని చెప్పారు. ఉచిత తరగతులు చెప్పే సెంటర్లకు రూ.15 లక్షల చొప్పున ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా.. పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -