ప్రస్తుతం ఉన్న యాంకర్స్ లో మంచి గుర్తింపుతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది హాట్ యాంకర్ రష్మీ. ఈ భామ యాంకర్ గానే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులే కొట్టేసింది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే వెండితెరపై కూడా ప్రేక్షకులను తన అందంతో దడ పుట్టిస్తోంది. బుల్లితెరపై రష్మీ ఉన్న ఫాలోయింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్టార్ హీరోయిన్స్ కి ఉన్నంత ఫాలోయింగ్ రష్మీ కి ఉందంటే అతిశయోక్తికాదు.
ఇక రూమార్స్ విషయంలో కూడా ఈ భామ తక్కువెం కాదు. జబర్దస్త్ కమెడియన్ సుధీర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన అవి నిజం కాదని తేల్చి చెప్పేసింది.. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ప్రదీప్ యాంకర్ గా చేసే ఈ ప్రోగ్రామ్ లో రష్మీ, సుధీర్ గెస్ట్ యాంకర్స్ గా చేస్తున్నారు.
ఈ వారం ప్రసారమయ్యే ఎపిసోడ్స్ లో సిగ్గు పడుతూ రష్మీ ఇచ్చే ఎక్స్ ప్రెషన్ కి ఎవరైనా ఆమెకి పడక తప్పదు.. మరి ఆమె ఆ ఎపిసోడ్ లో చేసిన రచ్చ చూడాలంటె బుధవారం ప్రసారమయ్యే ఎపిసోడ్ తప్పక చూడాల్సిందే.. ఇటివలే రాజ్ తరుణ్ తో ఐటెం సాంగ్ చేసేందుకు రష్మీ ఒప్పుకుంది. అలాగే మహేష్ సినిమాలో కూడా ఓ అవకాశం వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
{youtube}YTQtLYgIo1o{/youtube}
Related
