టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5న చెన్నై చెపాక్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో 227 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇక అదే మైదానంలో ఫిబ్రవరి 13 రెండో టెస్టు, ఫిబ్రవరి 24 మూడో, మార్చి 4న నాలుగో టెస్టు అహ్మదాబాద్‌లో జరుగనుంది. ఆ తర్వాత అదే నగరంలో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా జరుగనుంది.
ఈ క్రమంలో మార్చి 12 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తమ జట్టును ప్రకటించింది. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో టీమిండియాతో తలపడనున్న జట్టుకు సంబందించి 16 ఆటగాళ్ల పేర్లు వెల్లడించింది. ఫిబ్రవరి 26న ఇంగ్లండ్ జట్టు ఇండియాకు పయనం కానుందని తెలిపింది. కాగా మోతేరా స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్లు రాత్రి ఏడు గంటలకు ప్రారంభంకానున్నాయి.
ఇంగ్లండ్ టీ20 జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జొనాథన్ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, శామ్ కర్రన్, టామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, రీస్ టాప్లే, మార్క్ వుడ్.
ఇంగ్లండ్ అంటే అంతే, ఎవరైనా తప్పు కోవాల్సిందే..
స్విమ్మింగ్‌పూల్‌లో భార్య,కొడుకుతో పాండ్యా హల్‌చల్!
బోల్డ్ బ్యూటీ అరియానకు అరుదైన ఘనత
షర్మిల నిర్ణయం… బాబు నోటి నుంచి ఆ మాట..!