Friday, March 29, 2024
- Advertisement -

పంత్ విజృంభణ.. సిరీస్ కైవసం !

- Advertisement -

ఇండియా- ఇంగ్లండ్ మద్య జరుగుతున్నా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ టీమిండియా కైవసం చేసుకుంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక చివరి మ్యాచ్ లో భారత్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో 2-1 తేడాతో రోహిత్ సేన సిరీస్ ను కైవసం సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ టీమిండియా బౌలర్ల ధాటికి 259 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచారు. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 80 బంతుల్లో 60 పరుగులు ( 3 ఫోర్లు, 2 సిక్సులు ), జెసన్ రాయ్ 31 బంతుల్లో 41 పరుగులు ( 7 ఫోర్లు ) , క్రెగ్ ఓవర్టన్ 33 బంతుల్లో 32 పరుగులు ( 1ఫోర్, 1 సిక్స్ ) మాత్రమే రాణించగా.. మిగతా బ్యాట్స్ మెన్స్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.

ఇక టీమిండియా బౌలర్స్ లో హర్ధిక్ పాండ్య నాలుగు వికెట్లు, చహల్ మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశారు. ఇక 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శికర్ ధావన్ నిరాశపరిచారు..రోహిత్ 17 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. ధావన్ కేవలం ఒక్క పరుగుతోనే నిష్క్రమించాడు. ఇక ఆ తరువాత విరాట్ కోహ్లీ తన ఫామ్ లేమి ని కొనసాగిస్తూ మళ్ళీ నిరాశపరిచాడు..

అయితే టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 113 బంతుల్లో 125 పరుగులు ( 16 ఫోర్లు, 2 సిక్సులు ) చేసి మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఇక పంత్ కు తోడు పాండ్య కూడా 55 బంతుల్లో 71 పరుగులతో చెలరేగడంతో విజయం టీమిండియా ముంగిట వాలింది. ఇక సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా వన్డే సిరీస్, టి20 సిరీస్ కైవసం చేసుకోగా.. టెస్ట్ సిరీస్ డ్రా గా నిలిచింది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -