వసంత వర్ణాల కేళీ..
రవికిరణ బిందువుల రంగోళీ..
సప్తవర్ణాల కేళీ..
రంగుల కేళీ.. సంబురాల హోలీ !
విభిన్న సంస్కృతులు, భాషలు, జాతులు, మతాలకు పట్టినిల్లు భారత్. ఇలాంటి దేశంలో ప్రతి వేడుక ప్రత్యేకమే. అందులో మరీ ముఖ్యంగా రంగుల కేళీ హోలీ మరింత ప్రత్యేకం. కుల,మత,జాతులతో సంబంధం లేకుండా భారత్‌లో అన్ని వర్గాల వారు చాలా ఘనంగా హోలీ పండుగను జరుపుకుంటారు.
రకరకాల రంగులతో నిర్వహించుకునే రంగుల కేళీ.. రంగోళీ.. హోలీని చెడుపై మంచి విజయభావుట ఎగురవేసిందనే దానికి గుర్తుగా ప్రతియేటా జరుపుకుంటారు. ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్న భారతీయులందరూ ఈ సప్తవర్ణాల హోలీని పండుగను ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ జరుపుకుంటారు. రంగులు గుప్పుకుంటూ తమ ప్రేమను, ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.

హోలీని దేశంలో ఒక్కోదగ్గర ఒక్కో విధంగా జరుపుకుంటారు. వీటి పేర్లు కూడా భిన్నంగానే ఉంటాయి. మొత్తంగా అయితే.. హోలీ.. రంగులు మాత్రం ఉంటాయి. అసోంలో ఫకువా, డౌల్‌గా, గోవాలో ఉలిక్కిగా, యూపీలో లాథ్మర్ హోలీగా, కర్నాటకలో బేదర వేషా గా, పంజాబ్‌లో హోల్లా మొహల్లాగా, బెంగాల్‌లో డోల్ జాత్రాగా, మణిపూర్‌లో యోసాంగ్ గా జరుపుకుంటారు.
అభినవ ఉసేన్ బోల్ట్.. కంబళ వీరుడి సరికొత్త రికార్డు !
మణిశర్మ బీటూ.. చిరు స్టెప్పూ !