Friday, April 26, 2024
- Advertisement -

తెలంగాణలో ‘బ‌హిరంగ’ ఆంక్ష‌లు

- Advertisement -

దేశంలో క‌రోనా మ‌హమ్మారి విజృంభ‌ణ మొద‌లైంది. రోజురోజుకూ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతూ.. రికార్డు స్థాయిలో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. తెలుగు రాష్ట్ర‌ల్లోనూ క‌రోనా ప్ర‌భావం పెరుగుతోంది. తెలంగాణ‌లోనూ క‌రోనా కొత్త కేసులు అధికమవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలు, ప్రజా రవాణా వాహనాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాస్కులు ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం, ఐపీసీ కింద చర్యలు తీసుకుంటామని వెల్ల‌డించింది. బ‌హిరంగ ర్యాలీలు, స‌మావేశాలపై ఆంక్ష‌లు విధించింది. ఈ ఆంక్ష‌లు వ‌చ్చే నెల 30 (ఏప్రిల్ 30) వ‌ర‌కు అమ‌ల్లో ఉంటాయ‌ని పేర్కొంది.

క‌రోనా విజృంభ‌ణ దృష్ట్యా బహిరంగ ప్రదేశాలు, పార్కుల్లో మొద‌లైన‌టువంటి వాటిల్లో గుంపు స‌మావేశాలు నిర్వ‌హించ‌రాదు. అలాగే, మతపరమైన బ‌హిరంగ కార్యక్రమాలను నిర్వహించరాదనీ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనికి అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లాల ఉన్నతాధికారుల‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ సింపుల్ చిట్కాలతో విద్యుత్ బిల్లులు తగ్గించుకోండి !

టీనేజ్ దాటక హైట్ పెరగాలి అనుకుంటున్నారా ? అయితే ఇలా…

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు క‌రోనా

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్.. ఆయ‌న ఐదు బెస్ట్ సినిమాలు ఇవిగో !

దేశంలో ఒక్క‌రోజే 62,258 క‌రోనా కేసులు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -