Friday, March 29, 2024
- Advertisement -

మ‌ణిశ‌ర్మ బీటూ.. చిరు స్టెప్పూ !

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి… భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌నకంటూ ప్ర‌త్యేక చరితను రాసుకున్న న‌టుడు. ఎలాంటి సినీ కుంటుంబ నేప‌థ్యంలో లేకుండానే వెండితెర‌పైకి ఎంట్రీ ఇచ్చి.. త‌న‌దైన అభినయంతో మెగాస్టార్‌గా ఎదిగాడు. మ‌రీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయ‌న న‌ట‌న‌.. డాన్సులు.. యాక్ష‌న్ ! చిరంజీవి సినిమాలో ఈ అంశాలు పుష్కలంగా ఉంటాయి.

వెండితెర‌పై చిరు వేసే స్టెప్పులు ఇప్ప‌టికే య‌మ క్రేజ్. అందుకే ఆయ‌న మెగాస్టార్ అయ్యారు. ప్ర‌స్తుతం ఆచార్య సినిమా చేస్తున్నాడు చిరంజీవి. అయితే, చాలా కాలం త‌ర్వాత మ‌ణిశ‌ర్మ బీట్‌.. చిరు స్టెప్పులు ఆచార్య సినిమాతో మ‌ళ్లీ వెండితెర‌పై దుమ్ము రేప‌నుంది. ఈ ఇద్ద‌రి కాంభోలో వ‌చ్చిన అనేక సాంగ్ లు దుమ్మురేపాయి. మళ్లీ మరో ‘భం భం బోలే’తరహాలో ‘లాహీ లాహీ’అంటూ సాగే లిరికల్‌ వీడియోను మార్చి 31న 4:05 గంటలకు ‘ఆచార్య’ చిత్ర బృందం విడుదల చేయనుంది.

దీనిని సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఓ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది. అది చూస్తే చిరు మ‌ళ్లీ త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌నున్నాడ‌ని తెలుస్తోంది. కాగా, ఆచార్య సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో పాటు కాజ‌ల్‌, పూజా హెగ్దే తార‌గ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం మే 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు.

మళ్లీ లాక్‌డౌన్ అవ‌స‌రముండదు: ఏపీ హోం మంత్రి

తెలంగాణలో ‘బ‌హిరంగ’ ఆంక్ష‌లు

ఈ సింపుల్ చిట్కాలతో విద్యుత్ బిల్లులు తగ్గించుకోండి !

టీనేజ్ దాటక హైట్ పెరగాలి అనుకుంటున్నారా ? అయితే ఇలా…

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కు క‌రోనా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -