యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా వరుసగా ఆఫర్లు అందుకుంటోంది ఈ అమ్మడు. అయితే ఇటీవలి కాలంలో రాశి ఖన్నాకు ఆశించిన విజయాలు ఏవీ దక్కలేదు. అయినా ఈ బ్యూటీ వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. అదికూడా అగ్ర హీరోల సినిమాల్లో. ప్రస్తుతం రాశి ఖన్నా చేతిలో ఆరు సినిమాలు ఉండగా, అందులో నాలుగు తమిళ సినిమాల్లో నటిస్తోంది. రెండు తెలుగు సినిమాల్లో నటిస్తోంది.
ప్రస్తుతం రాశిఖన్నా తమిళంలో నటిస్తున్న ఆరణ్మయి -3, తుగ్లక్ దర్బార్ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో కూడా హీరో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయింది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాలతో పాటు రెండు హిందీ సినిమాల్లో కూడా నటించేందుకు రాశి ఖన్నా అంగీకారం తెలిపినట్లు సమాచారం. రాశి ఖన్నా తన కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పుడూ ఇంత బిజీ గా లేదు. ప్రస్తుతం రాశి ఖన్నా ఒక్కో సినిమాకు రూ.కోటి వరకు తీసుకుంటోంది. నాగ శౌర్య హీరోగా నటించిన తొలి సినిమా ఊహలుగుసలాడే సినిమా ద్వారా రాశి ఖన్నా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read
సీక్వెల్.. ఇప్పుడిదే సక్సెస్ ఫార్ములా?
బడా బ్యానర్లన్నీ సంతోష్ శోభన్ చుట్టే..!
#PSPK28 పవర్ స్టార్ కి జోడిగా సామ్..!
చందమామ కోసం సీనియర్ల క్యూ.. పెళ్లి తర్వాత కూడా జోరు తగ్గట్లే..!