యూట్యూబ్‌లో ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయి అనే దాని బట్టి.. పాట హిట్ అయ్యిందా? ఫట్ అయ్యిందా? అనే విషయం నిర్ధారించుకొనే రోజులువి. ఇప్పటికే పలు తెలుగు పాటలు, టీజర్లు, ట్రైలర్లు యూట్యూబ్‌లో సంచలన వ్యూస్ తెచ్చుకున్నాయి. గత ఏడాది అలవైకుంఠపురములో చిత్రంలోని బుట్టబొమ్మా, సామజవరగమన, రాములో రాములా వంటి వీడియో సాంగ్స్ రికార్డు వ్యూస్ తెచ్చుకొని సంచలనం సృష్టించాయి. అలాగే ఫిదా లోని పాటలు కూడా వందల మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్నాయి.
తాజాగా గద్దలగొండ్ గణేశ్ చిత్రంలోని ఎల్లువచ్చి గోదారమ్మ వీడియో సాంగ్ 100 మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఇది రీమేక్ చేసిన పాట.. గతంలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన దేవత అనే చిత్రంలో శోభన్‌బాబు, శ్రీదేవి మీద ఎల్లువొచ్చి గోదారమ్మ అనే పాటను తెరకెక్కించగా.. ఆ పాట సూపర్ హిట్ అయ్యంది.
గద్దల కొండ గణేశ్ చిత్రంలో.. వరుణ్‌తేజ్, పూజాహెగ్డే మధ్య ఈ పాటను రీమేక్ చేశారు. ఈ వీడియో సాంగ్ కూడా ప్రేక్షకాదరణ పొందింది. 100 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు మన తెలుగు పాటలు ఇటీవల విపరీతమైన వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంలోని నీలి నీలి ఆకాశంలో అనే పాట, ఉప్పెన లోని నీ కన్ను నీలి సముద్రం పాటలు కూడా భారీగా వ్యూస్ తెచ్చుకున్నాయి.
Also Read
గొంతునొప్పిని ఇట్టే తగ్గించే చిట్కాలు ఇవిగో !