Friday, April 26, 2024
- Advertisement -

హ్యాట్సాఫ్​ రాశీ ఖన్నా .. !

- Advertisement -

లాక్​డౌన్​ టైంలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ నటులు గుర్తింపు తెచ్చుకుంటున్నారు. బాలీవుడ్​ నటుడు సోనూ సూద్​ తన సేవలకు కొలమానాలు లేవు, కొలతలు లేవు, హద్దులు లేవు. అతడి సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఎక్కడ చూసినా సోనూ సూద్ పేరు మారుమోగిపోతున్నది. ఇదిలా ఉంటే సోనూ సూద్​ స్ఫూర్తితో చాలా మంది నటులు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి సైతం ఆక్సిజన్​ బ్యాంక్ లను నెలకొల్పారు. ప్రస్తుతం ప్రముఖ నటి రాశి ఖన్నా సైతం సేవలో నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆమె హైదరాబాద్​లో పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. రోటీ బ్యాంక్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆమె ఆకలితో అలమటిస్తున్న పేదలకు ఆహారం అందిస్తున్నారు.

రాశి ఖన్నా గతంలోనూ పలు సేవా కార్యక్రమాలు చేశారు. బీ ద మిరాకిల్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఆమె సేవ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఆమె ఎప్పుడూ బయటపెట్టలేదు. ఆమె ఇటీవల ఓ పోస్ట్​ పెట్టారు.’ నేను చాలా రోజులుగా సేవలు చేస్తున్నాను. కానీ నేను ఆ విషయం పెద్దగా ఎవరికీ చెప్పుకోలేదు. అటువంటి అవసరం కూడా రాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నేను చేస్తున్న సాయం సరిపోవడం లేదు. హైదరాబాద్​లో ఇంకా ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. వారికి సాయం చేయాలంటే మీ సహకారం కూడా కావాలి.

అందుకోసం ప్రతి ఒక్కరూ రూ. 40 సాయం చేయండి. ఆ డబ్బుతో మేము ప్రతి ఒక్కరి కడుపు నింప గలుగుతాం’ అంటూ ఆమె ఓ క్యాంపెయినింగ్​ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె రోటీ బ్యాంక్​ సేవా సంస్థ ఆధ్వర్యంలో 1200 మందికి సేవ చేస్తున్నారు. అయితే ఈ సేవలను మరింత విస్తృత పరచాలని ఆమె భావించారు. అందుకోసం పోస్టు పెట్టారు. దీంతో ఫ్యాన్స్​ నుంచి అనూహ్య స్పందన దక్కింది. రాశీ ఖన్నా హ్యాట్సాప్​ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. సదరు స్వచ్ఛంద సంస్థకు తమకు తోచిన సాయం చేస్తున్నారు.

Also Read

రాశి ఖన్నా జెట్ స్పీడ్.. ఒకేసారి ఆరు సినిమాల్లో ఛాన్స్..!

లైట్స్.. కెమెరా.. యాక్షన్..!

పెద్ద పనులు చేసే అమ్మాయ్ అంటూ ట్విట్ చేసిన రష్మిక..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -