Friday, March 29, 2024
- Advertisement -

100 మిలియన్​ క్లబ్ లోకి.. ‘ఎల్లువచ్చి గోదారమ్మ’

- Advertisement -

యూట్యూబ్​లో ఎన్ని మిలియన్ల వ్యూస్​ వచ్చాయి అనే దాని బట్టి.. పాట హిట్​ అయ్యిందా? ఫట్ అయ్యిందా? అనే విషయం నిర్ధారించుకొనే రోజులువి. ఇప్పటికే పలు తెలుగు పాటలు, టీజర్లు, ట్రైలర్లు యూట్యూబ్​లో సంచలన వ్యూస్​ తెచ్చుకున్నాయి. గత ఏడాది అలవైకుంఠపురములో చిత్రంలోని బుట్టబొమ్మా, సామజవరగమన, రాములో రాములా వంటి వీడియో సాంగ్స్ రికార్డు వ్యూస్​ తెచ్చుకొని సంచలనం సృష్టించాయి. అలాగే ఫిదా లోని పాటలు కూడా వందల మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్నాయి.

తాజాగా గద్దలగొండ్​ గణేశ్​ చిత్రంలోని ఎల్లువచ్చి గోదారమ్మ వీడియో సాంగ్​ 100 మిలియన్స్​ వ్యూస్​ సాధించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటన విడుదల చేసింది. నిజానికి ఇది రీమేక్​ చేసిన పాట.. గతంలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన దేవత అనే చిత్రంలో శోభన్​బాబు, శ్రీదేవి మీద ఎల్లువొచ్చి గోదారమ్మ అనే పాటను తెరకెక్కించగా.. ఆ పాట సూపర్​ హిట్​ అయ్యంది.

గద్దల కొండ గణేశ్​ చిత్రంలో.. వరుణ్​తేజ్​, పూజాహెగ్డే మధ్య ఈ పాటను రీమేక్​ చేశారు. ఈ వీడియో సాంగ్ కూడా ప్రేక్షకాదరణ పొందింది. 100 మిలియన్ వ్యూస్​ సాధించింది. దీంతో మెగా ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ అవుతున్నారు. మరోవైపు మన తెలుగు పాటలు ఇటీవల విపరీతమైన వ్యూస్​ తెచ్చుకుంటున్నాయి. యాంకర్​ ప్రదీప్​ హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంలోని నీలి నీలి ఆకాశంలో అనే పాట, ఉప్పెన లోని నీ కన్ను నీలి సముద్రం పాటలు కూడా భారీగా వ్యూస్​ తెచ్చుకున్నాయి.

Also Read

గొంతునొప్పిని ఇట్టే త‌గ్గించే చిట్కాలు ఇవిగో !

ఈ రుచి మాములుగా ఉండ‌దు.. క్యూ క‌ట్టాల్సిందే!

అర‌టాకులో భోజ‌నం ఎందుకు మంచిదో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -