షాకింగ్ న్యూస్ : పవన్ త్రివిక్రమ్ ల మూవీ స్టోరీ లీక్..?

Pawan And Trivikram Movie Story Leaked

‘కాటమరాయుడు’ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఇక పవన్ తన తదుపరి సినిమాని వచ్చేనెల లో మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్చం వహిస్తున్నాడు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇది ఇలా ఉండగా ఈమూవీకి త్రివిక్రమ్ వ్రాసిన కథ ఇదే అంటూ ఒక ఆసక్తికర కథనం ప్రస్తుతం ఫిలింనగర్ లో ప్రచారంలో ఉంది.

టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం  ఈ మూవీ కథ ఒక రివెంజ్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ మూవీలో పవన్ కు తండ్రి పాత్ర చేస్తున్న క్యారెక్టర్ కు ప్రతి విషయానికి ఒక స్టాండ్ బై ఉండాలి అన్నది ఆ వ్యక్తి ఆలోచనట. అందుకోసమే అతడి జీవితంలో ఇద్దరు భార్యలు రెండు వ్యాపారాలు రెండు ఇళ్ళు అదేవిధంగా రెండు ఆఫీసులు ఇలా ప్రతివిషయంలోను రెండు లేకుండా అతడి జీవితం ఉండదట. ఇలాంటి పరిస్థుతులలో పవన్ తండ్రిని అతడి వ్యాపారానికి సంబంధించిన విరోధులు చంపి వేయడం జరుగుతుంది అని టాక్.

దీనితో రెండవ భార్య కొడుకు అయిన పవన్ ను తన తండ్రి మొదటి భార్య పిలిచి తన సవతి కొడుకు పవన్ ను తండ్రిని శత్రువుల పై పగను తీర్చుకోమని చెపుతుందట. ఈ కథ కోసం చాల కమర్షియల్ అంశాలు త్రివిక్రమ్ జోడిస్తున్నట్లు తెలుస్తోంది.  దీనితో రెండు భారీ ఇళ్ళు రెండు భారీ ఆఫీసులు పక్కపక్కనే ఉండే విధంగా పవన్ తండ్రి క్యారెక్టర్ అద్బుతంగా ఉండేలా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అనిరుద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఏమైనా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వెరైటీ కథ ఎంత వరకు నిజమో చూడాలి..

{youtube}7nOIT8FA6Y0{/youtube}

Related

  1. పవన్ ఫ్యాన్స్.. లైవ్ లో పెద్ద గొడవ చేశారు
  2. పవన్ ఫ్యాన్స్ పై మహేష్ ఫ్యాన్స్ రివెంజ్ తీర్చుకున్నారు..?
  3. పవన్ ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలుసా..?
  4. పవన్ బరిలోకి దిగితే ఎవరికి లాభం..?