తెలుగువారందరికి తొలి తెలుగు నామ సంవత్సరం పండగ ఉగాది. జనవరి 1 తేదీన కొత్త సంవత్సరం మొదలు అవుతోంది. కానీ తెలుగు ప్రజలకి మాత్రం కొత్త సంవత్సరం మొదలు అయేది మాత్రం ఉగాది రోజునే. ఉగాది నుంచే తెలుగు వారికి కొత్త కాలెండర్ సృష్టిస్తారు పంచాగ కర్తలు. అయితే అందరూ.. తమ తమ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఉగాది పర్వదినాన పంచాగ కర్తలతో పంచాంగం జరిపించుకుంటారు చాలా మంది.
అలాగే వైసీపీ అధినేత జగన్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఈ సంవత్సరం సందర్భంగా పంచాంగకర్త రామచంద్ర శాస్త్రి వివరించారు. అయితే జగన్ జాతకం మాములుగా లదని అత్యద్భుతంగా ఉందని, జగన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాడమే కాక, జగన్ ముఖ్యమంత్రి కూడా అవుతారని ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చేది కూడా జగన్ మోహన్ రెడ్డేనంటూ తెలిపారు. ఇది కూడా 2019 ఎన్నికల తర్వాత జరుగుతుందని చెప్పుకొచ్చారు.
కాగా ఉగాది సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరయ్యారు. పంచాంగ శ్రవణాన్ని జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆలకించారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో జగన్ అధికారం దక్కించుకుంటారని అంటున్నారు.
{youtube}ribIbx5zd7Y{/youtube}
